యువభేరి ఏర్పాట్లలో నాని | Sakshi
Sakshi News home page

యువభేరి ఏర్పాట్లలో నాని

Published Mon, Sep 19 2016 10:51 PM

nani busy in yuva bheri  programme

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఈనెల 22న ఏలూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న యువభేరి కార్యక్రమం ఏర్పాట్లలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నిమగ్నమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని, రాష్ట్రానికి హోదాతో పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరిపోతుందని ఎంతగానో ఆశ పెట్టుకున్న యువత కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవడంతో వారికి అండగా వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా యువభేరి సభను జిల్లాలో నిర్వహిస్తున్నారు. స్థానిక వట్లూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్‌ యువకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే యువత, విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించడంలో నాని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాంతో కలిసి సోమవారం శ్రీ కన్వెన్షన్‌ హాలును సందర్శించారు. ఆయన వెంట పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాద్, నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, మామిళ్లపల్లి జయప్రకాష్, బండారు కిరణ్‌కుమార్, శిరిపల్లి ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement
Advertisement