తొమ్మిది స్కూల్‌ బస్సుల సీజ్‌ | Sakshi
Sakshi News home page

తొమ్మిది స్కూల్‌ బస్సుల సీజ్‌

Published Wed, Sep 21 2016 11:00 PM

nine school buses Siege

  •  8 ఆటోలు, 4 ద్విచక్ర వాహనాలు కూడా..
  •  నగరంలో వారం రోజులు స్పెషల్‌ డ్రైవ్‌
  •  డీటీసీ దుర్గాప్రమీల
  • చంద్రశేఖర్‌కాలనీ :
    నిజామాబాద్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు బుధవారం సాయంత్రం నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. జిల్లా ఉప రవాణా ఇన్‌చార్జి కమిషనర్‌ దుర్గాప్రమీల ఆధ్వర్యంలో మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్స్, అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్స్, సిబ్బంది నగరంలోని కంఠేశ్వర్‌లోని సీఎస్‌ఐ చర్చి సమీపంలో తనిఖీ చేశారు. రవాణా చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్‌ బస్సులు, ఆటోరిక్షాలు, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. నగరంలోని వివిధ ప్రైవేటు స్కూళ్లకు చెందిన 9 బస్సులను సీజ్‌ చేశారు. ఇందులో సామర్థ్యానికి మించిన నడుపుతున్నందున ఏడు బస్సులను, పర్మిట్‌ లేకుండా నడుపుతున్న రెండు స్కూల్‌ బస్సులను సీజ్‌ చేశారు. లైసెన్స్‌లు, ఓవర్‌లోడ్‌తో నడిపిన 8 ఆటోరిక్షాలను, సెల్‌పోన్‌ మాట్లాడుతూ, ద్విచక్రవాహనాలు నడిపిన నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశామని ఇన్‌చార్జి డీటీసీ దుర్గా ప్రమీల తెలిపారు. వారం రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. రవాణా చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, స్కూల్‌ బస్సులు, ఇతర వాహనాలు నడిపితే వాటిని సీజ్‌ చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు యశంత్‌కుమార్, రవికుమార్, ఏఎంవీఐలు వెంకటస్వామి, రఘుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement