హాజిపల్లి అభివృద్ధి అద్భుతం | Sakshi
Sakshi News home page

హాజిపల్లి అభివృద్ధి అద్భుతం

Published Sat, Aug 13 2016 9:40 PM

హాజిపల్లిని సందర్శించిన వివిధ దేశాల  సభ్యులు

– గ్రామాన్ని సందర్శించిన ఎన్‌ఐఆర్‌డీ సభ్యులు
– విదేశీ ప్రతినిధులకు స్వాగతం ఘన స్వాగతం
హజిపల్లి (షాద్‌నగర్‌ రూరల్‌) : జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ, నిర్మల్‌పురస్కార్‌ అవార్డులను అందుకున్న హాజిపల్లి అభివద్ధి అద్భుతంగా ఉందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ) బందం కితాబునిచ్చింది. శనివారం ఫరూఖ్‌నగర్‌ మండలంలోని ఈ గ్రామాన్ని ఇండోనేషియా, జిబోటి, మయన్మార్, తువలు, భూటాన్, ఘనా, కెన్యా, అజర్‌బైజన్, సౌత్‌ఆఫ్రికా, శ్రీలంక దేశాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు సందర్శించారు. విదేశీ ప్రతినిధులకు సర్పంచ్‌ సింగారం శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌ జంగమ్మ ఘనస్వాగతం పలికారు. గ్రామంలో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, సీసీరోడ్ల నిర్మాణం, తాగునీటి వ్యవస్థ, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి అభిివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మిస్తున్న కమ్యూనిటీ ఇంకుడుగంతను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయితీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. గ్రామాభివద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నిధులెలా సమకూర్చుకున్నారని, జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును సాధించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివద్ధిలో గ్రామస్తులతోపాటు మహిళాసంఘాలను భాగస్వాములను చేశామని, అభివద్ధి కమిటీలు వేశామని, గ్రామస్తుల సంపూర్ణ సహకారంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని సింగారం శ్రీనివాస్‌ వివరించారు. వందశాతం ఇంటì , నీటిపన్ను వసూలు చేస్తున్నామని, తద్వారా గ్రామాభిివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్లకుండా ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకున్నారని, ఒకవేళ ఎవరైనా బయటకు వెళితే జరిమానా విధిస్తామన్నారు. శిక్షణలో భాగంగానే వివిధ దేశాలకు చెందిన సభ్యులు హాజిపల్లిని సందర్శించారని ఎన్‌ఐఆర్‌డీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనురాధ తెలిపారు.
 
 

Advertisement
Advertisement