చెలా‘మనీ’ లేక.. | Sakshi
Sakshi News home page

చెలా‘మనీ’ లేక..

Published Thu, Nov 17 2016 4:20 AM

చెలా‘మనీ’ లేక..

బ్యాంకుల్లో డబ్బు లేక ప్రజల అవస్థలు
మధ్యాహ్నానికే ’నో మనీ’ అని
బోర్డులు తగిలిస్తున్న బ్యాంకులు
డీసీసీబీ పరిస్థితి తలకిందులు

 ఖమ్మం వ్యవసాయం : బ్యాంకుల్లో  డబ్బు అందక  చాలామంది నానాతంటాలు పడుతున్నారు. పలు చోట్ల భోజన సమయం తరువాత ’నోమనీ’ అనే బోర్డులు వేలాడుతున్నారుు. రోజుకు రూ.10 వేల చొప్పున డ్రా చేసుకునేందుకు గంటల తరబడి బ్యాంకుల్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. వరుసలో ముందున్న ఖాతాదారులకు  డబ్బు దొరుకుతుండగా, 11 గంటల తర్వాత బ్యాంకులకు వచ్చే వారికి లైన్‌లో  ఉన్నా భోజన సమయం వరకు కౌంటర్‌ను అందుకోలేక డబ్బు లభించటం లేదు.  దీంతో  సామాన్యులు, మధ్య తరగతి వారు, రైతులు, కార్మికులు   ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాల కోసం డబ్బు  డ్రా చేసుకోవాలని ఏటీఎంలను ఆశ్రరుుంచినా, పలుచోట్ల అవి పనిచేయటం లేదు. ఎక్కడో ఒకటి అరకొరగా పనిచేస్తుంది. చెస్ట్ బ్యాంకులు ఉన్న బ్యాంక్ బ్రాంచిల వద్ద ఉన్న ఏటీఎంలు అంతంత మాత్రంగా పనిచేస్తున్నారుు.  డీసీసీబీ బ్రాంచిల్లో పెద్దనోట్ల మార్పిడిని రద్దు చేయటంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.  తమ ఖాతాలు ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయని, తామ వద్ద ఉన్న పెద్దనోట్లను  మార్పు చేసుకోవడం ఇబ్బందికరంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement