మళ్లీ మాణిక్యాలరావుకే | Sakshi
Sakshi News home page

మళ్లీ మాణిక్యాలరావుకే

Published Sat, Aug 13 2016 12:11 AM

ones again minister manikyala rao got the chance

జెండా వందనం ఈ‘సారీ’ సుజాతకు దూరం
ఆమె వర్గీయుల డీలా
దళితులకు అవకాశం కల్పిం చకపోవడంపై నిట్టూర్పులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా కేంద్రంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా వందనం చేసే హ్యాట్రిక్‌ ఛాన్స్‌ కూడా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకే దక్కింది. ఇప్పటివరకూ రెండుసార్లు మంత్రి మాణిక్యాలరావుకు ప్రొటోకాల్‌ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ మధ్య నెలకొన్న విభేదాల దృష్ట్యా ఈసారైనా టీడీపీకి చెందిన దళిత మహిళా మంత్రి పీతల సుజాతకు ఆ అవకాశం కల్పిస్తుందని భావించారు. అందుకు భిన్నంగా మాణిక్యాలరావుకే జెండా వందనం బాధ్యతను అప్పగిం చడం ద్వారా బీజేపీపై ఉన్న ప్రేమను టీడీపీ మరోసారి వెల్లడించినటై్టంది. ఈ నిర్ణయంపై గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో కొనసాగుతున్న ఆమెను పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పనితీరులో మొదటి స్థానంలో నిలిచినా ప్రొటోకాల్‌లో చివరి స్థానంలో ఉంచడం ద్వారా పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదన్న విషయాన్ని చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేసినట్టయ్యింది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే మంత్రులు ఉన్నారు. ఒకరు తాడేపల్లిగూడెంకు చెందిన పైడికొండల మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్‌. కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్‌ను పక్కనపెట్టి టీడీపీకి చెందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు జెండా వందనం చేసే అవకాశం ఇస్తూ వస్తున్న చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది

Advertisement

తప్పక చదవండి

Advertisement