సైకో సూదిగాడి రెండో ఊహాచిత్రం ఇదే | Sakshi
Sakshi News home page

సైకో సూదిగాడి రెండో ఊహాచిత్రం ఇదే

Published Wed, Sep 2 2015 7:43 PM

సైకో సూదిగాడి రెండో ఊహాచిత్రం ఇదే

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటికి కునుకు లేకుండా చేస్తూ..పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సైకో సూదిగాడి ఆచూకీ ఇంకా దొరకలేదు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ఇంజక్షన్ సైకో రెండో ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. బుధవారం భీమవరం పోలీస్ స్టేషన్లో సైకో ఊహాచిత్రాన్ని పెట్టారు.

ఇంతకుముందు పోలీసులు సైకో సూదిగాడి ఒక ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. సైకో సూదిగాడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే సైకో సూదిగాడు పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు.

Advertisement
Advertisement