Sakshi News home page

నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు

Published Tue, Aug 30 2016 11:43 PM

rain in 4 days

అనంతపురం అగ్రికల్చర్‌ : రాగల నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథ్‌రెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి అందిన సమాచారం మేరకు రాగల నాలుగు రోజుల్లో 10 నుంచి 18 మి.మీ మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 33 నుంచి 34, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు.

గాలిలో తేమ ఉదయం 94 నుంచి 96, మధ్యాహ్నం సమయంలో 46 నుంచి 53 శాతం మధ్య ఉండొచ్చన్నారు. గంటకు 14 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షం కురిసిన ప్రాంతాల్లో పంటలకు రక్షకతడి అవసరం లేదన్నారు. తేలికపాటి వర్షం కురిసిన ప్రాంతాల్లో రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడులు ఇచ్చుకోవాలని సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement