కురిసింది వాన.. ‘అనంత’లోన.. | Sakshi
Sakshi News home page

కురిసింది వాన.. ‘అనంత’లోన..

Published Sat, Sep 10 2016 11:10 PM

కురిసింది వాన.. ‘అనంత’లోన.. - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : అనంతపురం నగరంతోపాటు పరిసర ఐదారు మండలాల పరిధిలో మాత్రమే శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది.  ఆకాశం మేఘావతమై జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసేలా కనిపించినా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ప్రధానంగా నగర పరిధిలో భారీ వర్షం కురిసింది. సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు, మున్సిపల్‌ ఆఫీస్, బస్టాండ్, వేణుగోపాలనగర్, సాయినగర్, గుల్జార్‌పేట, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

దీంతో రహదారులు మోకాళ్లలోతు నీళ్లు ప్రవహించాయి. రెండు గంటల పాటు జన జీవనం స్తంభించిపోయింది. అనంతపురంలో 40 మి.మీ వర్షం పడగా, బుక్కరాయసముద్రం  25 మి.మీ, పామిడి, నార్పల, ఆత్మకూరు, రాప్తాడు, గార్లదిన్నె, కూడేరు మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం, యాడికి, శింగనమల, యల్లనూరు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో తుంపర వర్షం పడగా మిగతా చోట్ల ఆకాశం మేఘావతమై ఉన్నా వర్షపాతం నమోదు కాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement