కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Published Sat, Sep 12 2015 3:52 PM

rain in several coastal area

విశాఖపట్టణం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అల్పపీడనం ప్రాంతంలో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంటుంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది.  ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది.

Advertisement
Advertisement