నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం

Published Thu, Nov 10 2016 10:13 PM

నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం - Sakshi

ఏలూరు (మెట్రో) : సక్రమంగా విధులు నిర్వహించని నిడదవోలు మునిసిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని మునిసిపాలిటీల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కమిషనర్లతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించడంలో ఏ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ ఇళ్లు అందించాలనే ప్రభుత్వ ఆదేశం మేరకు పట్టణాల్లో గృహనిర్మాణాలకు భూసేకరణ పూర్తిచేయాలని కమిషనర్లకు ఆదేశించారు. కమిషనర్లు యర్రా సాయిశ్రీకాంత్, కె.సాయిరామ్, పి.నాగేంద్రకుమార్, పి.రమేష్, డి.కృష్ణమోహన్, సీహెచ్‌ నాగనరసింహారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 
మాతాశిశు మరణాలు తగ్గాలి
జిల్లాలో మాతాశిశు మరణాలను నూరు శాతం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌తో మాతాశిశు మరణాలపై  వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఏఏ ఆసుపత్రుల్లో మరణాలు సంభవిస్తున్నాయో పక్కాగా కారణాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ ఔషదిలో ప్రతి రోజూ వివరాలను నూరుశాతం డేటా నమోదు చేయాలని ఏ రోజైనా వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే సంబంధిత డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యాధికారి కె.కోటేశ్వరి, జిల్లా మలేరియాధికారి వంశీలాల్‌ రాథోడ్, డీసీహెచ్‌ఎస్‌ శంకరరావు, డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. 
గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
జిల్లాలో గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని, 18 వేల గృహాల నిర్మాణాన్ని పూర్తిచేస్తే అదనపు గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఆయన కలెక్టర్‌తో చర్చించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,250 గృహాలను మంజూరు చేశామని, జిల్లాకు మరో 10 వేల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఫామ్‌పాండ్స్‌ నిర్మాణానికీ ప్రాధాన్యమిచ్చామని,  అవసరమైతే రైతు ఫామ్‌పాండ్స్‌ ద్వారా నీటిని మళ్లించుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. డీపీవో సుధాకర్, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మాణిక్యం, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement