ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు | Sakshi
Sakshi News home page

ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు

Published Fri, Aug 19 2016 12:27 AM

ఘనంగా గట్టు జన్మదిన వేడుకలు - Sakshi

నల్లగొండ టూటౌన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ  సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండి. ఫయాజ్, పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి యాదయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు శ్రీకాంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి. అజారొద్దీన్, ఎండి. రియాజొద్దీన్, జాని, ఎండి. రషీద్, పైయెద్‌ బేగం, అఫాన్, షాదప్, భరత్, అనిల్‌కుమార్, రఫి, అయితరాజు రాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement