10న రెండో విడత డ్వాక్రా రుణమాఫీ | Sakshi
Sakshi News home page

10న రెండో విడత డ్వాక్రా రుణమాఫీ

Published Sun, Nov 6 2016 12:19 AM

10న రెండో విడత డ్వాక్రా రుణమాఫీ

ఏలూరు (మెట్రో): జిల్లాలో రెండో విడత రుణమాఫీ కింద డ్వాక్రా మహిళలకు రు.181.54 కోట్లను ఈనెల 10వ తేదీ నుంచి మహిళల బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం లో శనివారం సాయంత్రం డీఆర్‌డీఏ, వెలుగు పథకాల ప్రగతి తీరు, ధాన్యం కొనుగోలు, చంద్రన్న బీమా పథకం అమలు అంశాలపై ఆమె సమీక్షించారు.  రెండో విడత సొమ్ము నేరుగా మహిళా గ్రూపులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. జిల్లాలో రు.25 వేల కోట్లతో పరిశ్రమలను స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో దళితుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు 600 ముర్రాజాతి గేదెలను 75 శాతం సబ్సిడీపై అందించనున్నామన్నారు. వెలుగు ఉద్యోగులకు 35 శాతం జీతాలు పెంచడంతో పాటు పనితీరును బట్టి మరో 10 శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఏపీడీ పూర్ణచంద్రరావు, కె.రవీంద్రబాబు, ఏపీఎంలు పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement
Advertisement