రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు

Published Sat, Dec 17 2016 1:18 AM

రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు - Sakshi

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం
- దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది
- అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు
- మహేశ్‌రెడ్డి చేరిక సందర్భంగా నరసరావుపేటలో భారీ బహిరంగ సభ


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: మోసకారి పాలకులు రాష్ట్రాన్ని అడ్డగో లుగా అమ్మేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడిని కాలర్‌ పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలా నిలదీస్తేనే రాజకీయా ల్లో ఉన్న నాయకులకు భయం కలుగుతుందని.. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలనుకొనే నేతలు వెనక్కి తగ్గుతారన్నారు. కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోటెత్తిన జనసందో హాన్ని ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ప్రజలు అల్లాడిపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లడబ్బుతో తెలంగా ణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబా బు అడ్డంగా దొరికిపోయారని, ఆడియో, వీడియో టేపులు కూడా బయటకు వచ్చాయ న్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని ముఖ్యమంత్రిపై ధ్వజ మెత్తారు. మనకు రావాల్సిన నీళ్లను ఎగువ నుంచి తెలంగాణ ఎత్తుకుపోతున్నా గట్టిగా నిలదీసే పరిస్థితి సీఎంకు లేకుండా పోయిందన్నారు. ప్రధానమంత్రి మోదీని చూసి చంద్రబాబు వణికిపోతున్నారని చెప్పా రు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాట తప్పిన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయ లేక నీళ్లు నములుతున్నారని ఆరోపించారు. గట్టిగా నిలదీస్తే.. ఈ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారనే భయం చంద్రబాబును వెం టాడుతోందని వివరించారు. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలు పాలకులకు ఇవ్వాల న్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి అందరమూ ఒక్కటవుదామని పిలుపునిచ్చారు.బాబు కాలర్‌ పట్టుకొని దుర్మార్గపు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశారు. సభలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే...

‘‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదు. నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పు డూ ఒకమాట చెబుతుండేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని అనేవారు. అబద్ధా లు చెప్పి, మోసం చేసే ముఖ్యమంత్రి వద్దని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నాయకుడంటే ప్రజలంతా గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను మోసం చేసిన వాడు తమ నాయకుడని ప్రజలు సిగ్గుతో తలదిం చుకొనే విధంగా ఉండకూడదు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు  ఎన్నో హామీలిచ్చారు.

రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు వచ్చారు.. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రాలేదు.. నోటీసులు మాత్రం వచ్చాయి. రుణమాఫీ చేయకుండా రైతులను దగా చేశారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా  అక్కచెల్లెమ్మలను  వంచించారు. మోసం చేయకుండా సమాజంలోని ఏ వర్గాన్నీ వదల్లేదు. బాబొస్తే జాబొస్తుందంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అం దజేస్తామన్నారు. గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు’’ అని జగన్‌ నిప్పులు చెరిగారు.

జంగా  కృష్ణమూర్తికి  అన్యాయం జరగదు
‘‘ఈ రోజు కాసు మహేశ్‌రెడ్డిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. నాకు తోడుగా రా.. అన్నగా నీకు అండగా నిలుస్తానని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు పాలన తో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారు. ఆయన చేసిన మోసాల వల్ల జనం అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి మోసపూరిత పాలనకు చరమగీతం పాడాలంటే మనమం తా ఒక్కటి కావాలి. అందులో భాగంగానే మహేశ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాను. మహేశ్‌ రాక వల్ల నరసరావుపేటలో గందర గోళం(కన్‌ఫ్యూజన్‌) నెలకొంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆనందంగా ఎదురు చూస్తున్నారమో! ఎలాంటి గందరగోళం ఉండదని నేను గట్టిగా చెబుతున్నా. కారణం ఏమిటంటే.. మహేశ్‌ను చేర్చుకునే ముందు గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తితో మాట్లాడాను. ప్రజలను అడు గడుగునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభు త్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని జంగన్న (జంగా కృష్ణమూర్తి)తో చెప్పా.

తర్వాత ఇద్దరం కలసికట్టుగా ఆలోచన చేశాం. గురజా ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. క్లబ్బుల దగ్గర్నుంచి మైన్‌ల దాకా.. ఇసుక దగ్గర్నుంచి చివరకు సినిమా థియేటర్ల దాకా అంతటా అరాచకమే. అక్కడ రౌడీయి జమే రాజ్యమేలుతోంది. ఇలాంటి దారుణాల కు అడ్డుకట్ట వేయడానికి యువకుడు, ఉత్సా హవంతుడు అయిన మహేశ్‌రెడ్డిని తీసుకొద్దా మని చెప్పా. గురజాల నియోజకవ ర్గంలో నిలబడుతున్న నా తమ్ముడు మహేశ్‌ను ఆశీర్వ దించాలని ప్రజలను కోరుతున్నా. నరసరావు పేట నియోజకవర్గంలో అందరికీ పరిచయçస్తు డు, డాక్టరు, సౌమ్యుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనసాగుతారు. నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్లు నాకు నాన్నగా అండగా నిలిచా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదని గట్టిగా చెబుతున్నా. నేను ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న ఆరు నెలలకే జంగన్నను చట్టసభల్లోకి తీసు కొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానని సభాము ఖంగా చెబుతున్నా’’ అని జగన్‌ అన్నారు.

బాబు మోసం చేశారు
రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారా? లేదా? సభికులను జగన్‌ అడిగారు. ఇచ్చారని సభికుల నుంచి సమాధానం వచ్చింది. చేతులు ఊపుతో చెప్పాలని జగన్‌ కోరడంతో.. అందరూ చేతులు పైకెత్తారు. బాబు మోసం చేశారని బిగ్గరగా బదులిచ్చారు. రుణమాఫీ జరిగిందా? సభికులకు మళ్లీ జగన్‌ ప్రశ్న. లేదు.. లేదు.. అని సభికుల సమాధానం. రెండు చేతులూ పైకెత్తి.. చేయి తిప్పుతూ.. రుణమాఫీ జరిగిందో.. లేదో.. చూపించాలని జగన్‌ అడిగారు. కిక్కిరిసిన సభలో అందరూ చేతులు పైకెత్తి రుణమాఫీ చేయలేదంటూ చేతులు తిప్పారు. రుణమాఫీ చేస్తానని బాబు మోసం చేశారా? లేదా? మళ్లీ జగన్‌ ప్రశ్న.

బాబు మోసం చేశాడు.. సభికుల సమాధానం. రెండు చేతులు పైకెత్తి చెప్పాలని మళ్లీ జగన్‌ సూచన. సభలో ఉన్న వారంతా చేతులు పైకెత్తి మోసం చేశారన్నట్లుగా చేతులు ఊపారు. బాబు మోసం చేశారంటూ గట్టిగా చెప్పాలని జగన్‌ మళ్లీ అడిగారు. ‘బాబు మోసం చేశారు’ అని ప్రజలు గట్టిగా నినదించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందంటూ యువతకు చేసిన మోసం గురించీ ఇదే విధంగా జగన్‌ సభలో ఉన్న వారిని అడిగారు. రెండు చేతులు పైకెత్తి.. చేతులు తిప్పుతూ.. బాబు మోసం చేశారంటూ ప్రజలు నినదించారు. కాగా కాసు మహేశ్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యమైందనీ  అంతం వరకూ వైఎస్సార్‌సీపీ ఉంటానన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలన్నారు.

Advertisement
Advertisement