మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం | Sakshi
Sakshi News home page

మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం

Published Wed, Aug 17 2016 12:07 AM

Sports can contribute to mental peace

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌
  • ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పోలీస్‌ జట్టు విజయం
  • రన్నరప్‌గా రెవెన్యూ జట్టు
  • వరంగల్‌æ: విధి నిర్వహణలో ఉద్యోగులకు ఎదురయ్యే ఒత్తిళ్లు అధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్షణ్‌ అన్నారు.
    హన్మకొండలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో మం గళవారం జరిగిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ – జిల్లా రెవెన్యూశాఖల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన కొద్ది సేపు బ్యాటింగ్, బౌ లింగ్‌ చేశారు. కమిషనరేట్‌ జట్టుకు సీపీ సుధీర్‌బాబు, రెవెన్యూ జట్టుకు జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నాయకత్వం వహించారు. టాస్‌ గెలిచి పోలీస్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్‌ చేసిన రెవెన్యూ జట్టు  నిర్ణీత 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. బౌలింగ్‌లో కమిషనర్‌ సుధీర్‌బాబు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పోలీస్‌ జట్టు 15.5 ఓవర్లలో 119 పరుగులు చేసి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. ఆఖరు ఓవర్‌లో మెుత్తం ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరు బాల్‌కు ఆరు పరుగులు కావాల్సి ఉండగా కోర్‌ టీం కానిస్టేబుల్‌ ఖాలిద్‌ సిక్సర్‌ కొట్టడంతో విజయం సాధించారు. ఖాలిద్‌ 76 పరుగులు చే సి కమిషనరేట్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జట్ల మధ్య మరో ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఇందులో పోలీస్‌ జట్టు మీడియా జట్టుపై విజయం సాధించింది. కార్యక్రమంలో ఏసీపీలు మహేందర్, శోభన్‌కుమార్, జనార్ధన్, సురేంద్రనాథ్, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, తహశీల్దార్లు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తిలు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement