అతిసారా.. ప్రాణాంతకం | Sakshi
Sakshi News home page

అతిసారా.. ప్రాణాంతకం

Published Thu, Jul 28 2016 11:29 PM

take care with seasonal deseases

  •  సీజనల్‌ వ్యాధుల్లో అతి భయంకరమైంది ఇదే
  • జాగ్రత్తలు వహించాలటున్నా వైద్యులు..
  • చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
  • లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
  • కెరమెరి : వర్షాకాలం వచ్చేసింది. ఇక అంతా జాగ్రత్త ఉండాల్సిందే. ఏటా వచ్చే సీజనేబుల్‌ వ్యాధుల్లో ప్రధానమైనవి అతిసారా.. వర్షాకాలంలో పారిశుధ్యలోపం. తాగునీరు, కులషితమై ఈ వ్యాధి సోకుతుంది. అతిసారా వ్యాధి సోకితే వాంతులు, వీరేచనాలు అధికమై శరీరం అదుపు తప్పుతుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ వ్యాధి ఒక్కో సారి ప్రాణాలను కూడా హరిస్తుంది. వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్యుల సలహలు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చు. అయితే అతిసారా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం ఉండదు. 
    తీసుకోవల్సిన జాగ్రత్తలు..!
    – రోజు లీటర్ల నీటికి 50 గ్రాముల బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాలి. 
    –  రక్షిత నీటి పథకం పైప్‌లైన్‌ వాల్వుల్లో ఏదైనా లీకేజీ అయితే వెంటనే గ్రామీణ నీటి సరఫరా అధికారులకు తెలియజేయాలి
    ‘ గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత నీటి సరఫరా ట్యాంకులు ప్రతి పదిహేను రోజులకోసారి శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.
    ‘ గుంతల్లో ఉండే నల్లాల దగ్గర నీరు కలుషతమయ్యే అవకాశముంది. అక్కడా పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
    ‘ పబ్లిక్‌ నల్లాలు, చేతిపంపుల వద్ద దుస్తులు ఉతకరాదు. 
    ‘ వేడిచేసి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి
    ‘ తాగు నీటిని శుభ్రపరచడానికి ఒక బిందెడు నీళ్లల్లో ఒక క్లోరిన్‌ బిళ్ల వేసి అరగంట ఆగిన తర్వాత ఈ నీటిని తాగాలి. 
     క్లోరిన్‌ బిళ్లలు ప్రతీ ఆరోగ్య కార్యాకర్త వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. 
     అతిసారా సోకిన వ్యక్తికి వెంటనే ఓరల్‌ డిహైడ్రేషన్‌ ద్రావణం తాగించాలి. ఈ ద్రావణాన్ని ఆరోగ్యవంతులు కూడా తీసుకోవచ్చు.
    ‘ నియంత్రణ కాకుంట దగ్గర్లోని పీహెచ్‌సీకి లేదా ప్రై వేటు వైద్యశాలకు తీసుకెళ్లాలి.
    ‘ పైపుల ద్వారా నీటి సరఫరా ఉన్న చోట మురుగు కాల్వలోకి వెల్లకుండా చూడాలి.
    ‘ మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి. 
    ‘ తినే ఆహారం పై మూతలు ఉంచాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని బాగా మగ్గిన పండ్లను తినరాదు. రోడ్లపై తినుబండారాలకు దూరంగా ఉంటేనే మంచిది. 
    ‘ ఈగలు, దోమల నుంచి రక్షణలేని దుకాణాల్లో తినబండారాలను కొనరాదు. 
    ‘ అవేకాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా సురక్షితంగా ఉండవచ్చు. 
    జాగ్రత్తలతో వ్యాధికి దూరం..
    అతిసారా రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి. మరగకాచిన నీటిని చల్లార్చి వడపోసిన తర్వాత త్రాగాలి. త్రాగు నీటి బోర్లు, పబ్లిక్‌ నల్లాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. అతిసారా సోకిన వ్యక్తి వెంటనే ఓరల్‌ డిహైడ్రేషన్‌ ద్రావణం తాగాలి. వాంతులు, వీరేచనాలు వచ్చిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి, నల్వున్నాహారం, మగ్గినపళ్లు తినరాదు. – శ్రీనివాస్, వైద్యాధికారి,  పీహెచ్‌సీ కెరమెరి 90
     

Advertisement
Advertisement