మరిగడి–చౌడారం ఎంపీటీసీగా సిద్ధయ్య విజయం | Sakshi
Sakshi News home page

మరిగడి–చౌడారం ఎంపీటీసీగా సిద్ధయ్య విజయం

Published Sun, Sep 11 2016 12:01 AM

The success of the burnt-caudaram empitisiga siddhayya

  • ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కళింగరాజు
  • మూడో స్థానంలో సీపీఎం అభ్యర్థి.. 
  • టీడీపీ అభ్యర్థికి దక్కని డిపాజిట్‌
  • జనగామ : జనగామ మండలంలోని మరిగడి–చౌడారం ఎంపీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈనెల 8న ఎన్నికలు నిర్వహించగా పోలైన ఓట్లను శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో లెక్కించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్ణ, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి హసీమ్‌ నేతత్వంలో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించగా 25 నిమిషాల్లో ఫలితం వెల్లడైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి దూడల సిద్ధయ్య, టీఆర్‌ఎస్‌ నుంచి మేకల కళింగరాజు, సీపీఎం నుంచి బాల్నె వెంకట్‌రాజు, టీడీపీ నుంచి సల్లూరి అశోక్‌ బరిలో నిలిచిన విషయం విదితమే. ఈ మేరకు మరిగడి పోలింగ్‌ కేంద్రం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 287, కాంగ్రెస్‌ 181, సీపీఎం 211, టీడీపీ 75 ఓట్లు, రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 147, కాంగ్రెస్‌ 253, సీపీఎం 265, టీడీపీ అభ్యర్థికి 50 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో వెనుకంజలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి రెండో రౌండ్‌కు వచ్చే సరికి 106 ఓట్ల ఆధిక్యానికి వచ్చారు. ఇక చౌడారం పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్లను మూడో రౌండ్‌గా లెక్కించగా టీఆర్‌ఎస్‌కు 276, కాంగ్రెస్‌ 529, సీపీఎం 36, టీడీపీ 41 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు 963 ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి దూడల సిద్ధయ్య 253 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కళింగరాజు రెండో స్థానంలో, సీపీఎం అభ్యర్థి వెంకట్‌రాజు మూడో స్థానంలో నిలవగా టీడీపీ అభ్యర్థి అశోక్‌ డిపాజిట్‌ కోల్పోయారు. నోటాకు సైతం 28 ఓట్లు పోలయ్యాయి. ఈ మేరకు అధికార పార్టీ అభ్య ర్థి ఓటమి పాలు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. 
     
     
    దాసరి రవి మృతితో ఉప ఎన్నిక
    మరిగడి–చౌడారం ఎంపీటీసీగా ఉన్న దాసరి రవి మృతి చెందగా ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇండిపెండెంట్‌గా నిలిచి విజయం సాధించిన రవి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఆయన గుండెపోటుతో మరణించగా ఏడాది తర్వాత ఉప ఎన్నిక నిర్వహించగా ఆ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది.
     
    నారాయణపురంలో సీపీఎం అభ్యర్థి విజయం
    బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి ఎండీ.మహబూబ్‌ విజయం సాధించా రు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సదానందం, ఎంపీడీవో రమేష్‌ నేతృత్వంలో శనివారం ఈవీఎంలను తెరిచి ఓట్లను లెక్కించారు.  నారాయణపురంలో రెండు, నక్కవానిగూడేనికి సంబంధించి ఒక్క ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కించిన అధికారులు మొత్తం 1,178 ఓట్లు నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో సీపీఎం అభ్యర్థి మహబూబ్‌కు 633 ఓట్లు, స్వతంత్రlఅభ్యర్థి పరిదె అయిలమ్మకు 519 ఓట్లు, 26 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఈ మేరకు మహబూబ్‌ 114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు వెల్లడించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. 

Advertisement
Advertisement