డ్రైవరే నిందితుడు | Sakshi
Sakshi News home page

డ్రైవరే నిందితుడు

Published Tue, Oct 18 2016 12:49 AM

డ్రైవరే నిందితుడు - Sakshi

భీమవరం టౌన్‌ : భీమవరంలో శనివారం జరిగిన భారీ చోరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కారు డ్రైవరే నిందితుడని తేల్చారు. అతని వద్ద నుంచి రూ.15లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను భీమవరం టూటౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో సోమవారం నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..  భీమవరం టూటౌన్‌ ఆదర్శ నగర్‌కు చెందిన గాదిరాజు శ్రీనివాసరాజు ఈనెల 15న ఉదయం రాజస్థాన్‌ వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన భార్య కృష్ణకుమారి ఇంటికి తాళం వేసి శివరావు పేటలోని తన సోదరి ఇంటికి కారులో వెళ్లారు. ఆమెను అక్కడ దింపిన కారు డ్రైవర్‌ దారం మోహనరావు ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసి వస్తానని చెప్పి వచ్చేశాడు. ఇంటి వద్ద యజమానులు ఎవరూ లేక పోవడంతో డ్రైవర్‌ మోహనరావు అంతకుముందే కారు డ్యాష్‌ బోర్డులోంచి దొంగిలించిన ఇంటి తాళాలతో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. బెడ్‌రూంలోని అల్మరాలో ఉన్న లాకర్‌ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించిన కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఆదేశాలతో డీఎస్పీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సీఐ ఎం.రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేపట్టారు.  ఆదివారం సాయంత్రం చినఅమిరం గ్రామం కొత్తపేటలో  డ్రైవర్‌ మోహనరావును అతని ఇంటి వద్దే అదుపులోకి తీసుకుని  సీఐ రమేష్‌బాబు విచారించారు. దీంతో నేరాన్ని మోహనరావు అంగీకరించాడు. మూడేళ్లుగా శ్రీనివాసరాజు ఇంట్లో మోహనరావు నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతను దొంగిలించిన లాకర్‌ను తన ఇంట్లో భద్రపరిచాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాకర్‌లో ఉన్న 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50వేలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన తర్వాత  రోజు వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై బి.సురేంద్రకుమార్, ఐడీ పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.కె.జిలాని, కానిస్టేబుళ్లు బాబూరావు, ప్రసాద్‌ను డీఎస్పీ అభినందించారు.  
 

Advertisement
Advertisement