-
హైదరాబాద్: అద్దెకుంటూ అదును చూసుకుని!
సాక్షి, హైదరాబాద్: రాజస్థాన్ నుంచి వలసవచ్చి నగరంలో నివసిస్తున్న ఇద్దరు యువకులు... ఒకరి ఇంటి యజమాని ఇంటికే కన్నం వేశారు. ఆ సొత్తును తమ స్వస్థలంలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ కేసులో రిసీవర్ దొరికినా వీళ్లు మాత్రం చిక్కలేదు. దర్యాప్తు చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఈ ద్వయంతో పాటు రిసీవర్‌ను పట్టుకుందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. సికార్ జిల్లాకు చెందిన ఇమ్రాన్ అన్సారీ, ముఖేష్ కుమార్ శైని నగరానికి వలసవచ్చి మార్బల్ వర్కర్స్‌గా పని చేస్తున్నారు. చంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో ఉన్న వ్యాపారి ఇంటి పైన ఉన్న పెంట్ హౌస్‌లో అన్సారీ, కోఠిలో ముఖేష్ నివసిస్తున్నారు. అన్సారీ ఇంటి యజమాని గతేడాది ఆగస్టులో లండన్ వెళ్లారు. ఈ విషయం తెలిసిన ఇతగాడు అదే ఇంట్లో చోరీ చేయాలని భావించాడు. దీనికోసం ముఖేష్‌తో కలిసి రంగంలోకి దిగాడు. ఆ ఇంటి తాళం పగులకొట్టి 318 గ్రాముల బంగారం, నగదు తస్కరించారు. ఈ సొత్తును తమ స్వస్థలానికి తీసుకువెళ్లి దీన్ దయాల్‌తో పాటు ఇమ్రాన్ సోదరుడు ఉస్మాన్‌లకు విక్రయించారు. చోరీ కేసు దర్యాప్తు చేసిన చంద్రాయణగుట్ట పోలీసులు గతేడాది సెప్టెంబర్‌లో ఉస్మాన్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇమ్రాన్, ముఖేష్ పరారీలోనే ఉన్నారు. నగరానికి వచ్చిన ఈ ద్వయం కోఠిలో నివసిస్తోంది. వీరి కోసం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ముమ్మరంగా గాలించి పట్టుకుంది. విచారణలో దీన్‌దయాల్ పేరు బయటకు రావడంతో అతడినీ అరెస్టు చేసి 318 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుంది. -
డ్రైవరే నిందితుడు
భీమవరం టౌన్ : భీమవరంలో శనివారం జరిగిన భారీ చోరీ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కారు డ్రైవరే నిందితుడని తేల్చారు. అతని వద్ద నుంచి రూ.15లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేçÙన్లో సోమవారం నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భీమవరం టూటౌన్ ఆదర్శ నగర్‌కు చెందిన గాదిరాజు శ్రీనివాసరాజు ఈనెల 15న ఉదయం రాజస్థాన్ వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన భార్య కృష్ణకుమారి ఇంటికి తాళం వేసి శివరావు పేటలోని తన సోదరి ఇంటికి కారులో వెళ్లారు. ఆమెను అక్కడ దింపిన కారు డ్రైవర్ దారం మోహనరావు ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసి వస్తానని చెప్పి వచ్చేశాడు. ఇంటి వద్ద యజమానులు ఎవరూ లేక పోవడంతో డ్రైవర్ మోహనరావు అంతకుముందే కారు డ్యాష్ బోర్డులోంచి దొంగిలించిన ఇంటి తాళాలతో తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. బెడ్రూంలోని అల్మరాలో ఉన్న లాకర్‌ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించిన కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో డీఎస్పీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సీఐ ఎం.రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం చినఅమిరం గ్రామం కొత్తపేటలో డ్రైవర్ మోహనరావును అతని ఇంటి వద్దే అదుపులోకి తీసుకుని సీఐ రమేష్‌బాబు విచారించారు. దీంతో నేరాన్ని మోహనరావు అంగీకరించాడు. మూడేళ్లుగా శ్రీనివాసరాజు ఇంట్లో మోహనరావు నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతను దొంగిలించిన లాకర్‌ను తన ఇంట్లో భద్రపరిచాడు. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాకర్లో ఉన్న 70 కాసుల బంగారు ఆభరణాలు, రూ.50వేలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన తర్వాత రోజు వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై బి.సురేంద్రకుమార్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఎస్.కె.జిలాని, కానిస్టేబుళ్లు బాబూరావు, ప్రసాద్‌ను డీఎస్పీ అభినందించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్‌కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్‌పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్‌కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement