కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతే | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతే

Published Thu, Dec 1 2016 2:59 AM

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతే - Sakshi

టీ.టీడీపీ అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో ముగిసిన ‘రైతుపోరు’

 సాక్షి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య పాలనలో 16 మంది ముఖ్యమంత్రులు 60 ఏళ్ల పాలనలో చేయనంత అప్పు కేవలం రెండున్నరేళ్లలో రూ.1.07 లక్షల కోట్లు చేశారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రమాదపు అంచుల్లోకి వెళ్తు న్న తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత ప్రజలందరిపై ఉందని.. ప్రతి ఒక్కరూ నడుంబిగించి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై టీ.టీడీపీ తరఫున నవంబర్ 6న ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన ‘రైతుపోరుయాత్ర’ను బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గిలో ముగించారు. ఈ సందర్భంగా బొంరాస్‌పేట మండలం పోలేపల్లి నుంచి కోస్గి మండల కేంద్రం వరకు 8 కి.మీ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ‘‘సీఎం కేసీఆర్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. తెలంగాణ సమాజం దొరల వైపు ఉంటుందా.. బడుగుల కోసం పోరాడే టీడీపీ వైపు ఉంటుందా తేల్చుకోవాలి. 

కేసీఆర్‌ను ఇక భరించే ఓపిక లేదని సీఎం కుర్చీ నుంచి దించేందుకు ప్రజలు కదలాలి’’ అని అన్నా రు. నకిలీ విత్తనాల వల్ల రైతాంగానికి రూ. 690 కోట్ల నష్టం వాటిల్లిందని వాటి ని వెంటనే విత్తన కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు ఎకరాకు రూ.40 వేలు అందజేయాలన్నారు. కరువు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రైతులకు ఇవ్వాల్సిన నిధులను వాటర్‌గ్రిడ్‌కు మళ్లించారని ఆరోపించారు.

Advertisement
Advertisement