ఫైళ్లను త్వరితగతిన అప్‌లోడ్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

ఫైళ్లను త్వరితగతిన అప్‌లోడ్‌ చేయాలి

Published Mon, Sep 26 2016 6:50 PM

upload files as early as posible

–కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి
నల్లగొండ : నూతన జిల్లాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఫైళ్లను త్వరితగతిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా విభజనకు జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి నియమించిన ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంకా కొన్ని శాఖల ఫైళ్లు అప్‌లోడ్‌ చేయలేదని, ఫర్నీచర్, వాహనాల వివరాలు కూడా నమోదు చేయలేదన్నారు. రెండు రోజుల్లో పూర్తి నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. అలాగే ఫైళ్లను స్కానింగ్‌ చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయించిన భవనాల్లో పనులను త్వరగా చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, నోడల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement