పోలవరానికి పెట్టుబడులు మేమే పెడుతున్నాం | Sakshi
Sakshi News home page

పోలవరానికి పెట్టుబడులు మేమే పెడుతున్నాం

Published Sun, Apr 24 2016 2:22 AM

పోలవరానికి పెట్టుబడులు మేమే పెడుతున్నాం - Sakshi

మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతోందని, ఇప్పటివరకు రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోతే రోజుకు రూ.3.50 కోట్ల చొప్పున సగటున నెలకు రూ.100 కోట్ల నష్టం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన పనులన్నీ పూర్తి చేసి చూపిస్తామన్నారు. కేంద్రం సహకరిస్తే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2017 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్ట్ మెయిన్ పనులు పూర్తి చేస్తామని, మిగతా పనులన్నీ 2018 నాటికి పూర్తయ్యేలా అధికారులను ఆదేశించామని చెప్పారు. జూన్ నెలాఖరుకు ఎర్త్ వర్క్ పనులు పూర్తి చేసి జూలై నుంచి  కాంక్రీట్ పనులు చేపడతామని వెల్లడించారు.

 వాగుల నీళ్లన్నీ కృష్ణా డెల్టాకే: జిల్లాలోని వాగులు, వంకల ద్వారా వచ్చే నీళ్లన్నిటినీ పోల వరం కుడి కాలువలోకి ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు తరలిస్తామని బాబు స్పష్టం చేశారు.  పెదవేగి మండ లం వంగూరులో నీరు- ప్రగతి కార్యక్రమంపై జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  

 ఢిల్లీలో సీఎం: ఏపీ సీఎం బాబు శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు-రాష్ట్రాల సీఎంల సదస్సులో పాల్గొననున్నారు. కాగా శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు విందు ఇచ్చారు.

Advertisement
Advertisement