కవలలకు పురుడు పోసిన 108 | Sakshi
Sakshi News home page

కవలలకు పురుడు పోసిన 108

Published Fri, Jun 23 2017 11:41 PM

కవలలకు పురుడు పోసిన 108

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని పులచెర్ల గ్రామానికి చెందిన బెస్త ఆదిలక్ష్మి(25)కి శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేశారు. కణేకల్లులోని 108 సిబ్బంది ఉదయం 10 గంటలకు వచ్చి ఆమెను తీసుకుని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. రమనేపల్లి వద్ద ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితి హైరిస్క్‌గా అనిపించడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఈఎంటీ(ఎమర్జెనీ మెడికల్‌ టెక్నీషియన్‌) మోహన్‌ ఫైలెట్‌ రఫీ సహకారంతో అక్కడే సురక్షితంగా కాన్పు చేశారు. ఆదిలక్ష్మి కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. కాన్పు అనంతరం వారిని కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చేర్పించారు. హైరిస్క్‌ కేసును భగవంతుని దయతో విజయవంతంగా నిర్వహించగలిగామని ఈఎంటీ అన్నారు.
- కణేకల్లు

Advertisement
Advertisement