పూర్తి కావచ్చిన పనులు | Sakshi
Sakshi News home page

పూర్తి కావచ్చిన పనులు

Published Fri, Jul 22 2016 12:58 AM

పూర్తి కావచ్చిన పనులు - Sakshi

- రూ.కోటి యాభైలక్షలతో గోదాం నిర్మాణం
-  95శాతం పూర్తయిన పనులు
 - 2400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం 
నిడమనూరు : నిడమనూరు వ్యవసాయ మార్కెట్లో నాబార్డ్‌ నిధులు రూ.కోటి యాభైలక్షలతో నిర్మిస్తున్న గోదాం త్వరలో అందుబాటులోకి రానుంది. వ్యవసాయ మార్కెట్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నూతన గోదాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 
25వందల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం..
కొత్త గోదాం పూర్తయితే 25వందల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర ్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 6వందల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నాలుగు, రెండు మెట్రిక్‌ టన్నులతో రెండు గోదాంలున్నాయి. కొత్త గోదాం అందుబాటులోకి వస్తే మరో 8900 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం సమకూరుతుంది. రైతుల ప్రయోజనాల కోసం ఈ గోదాంల నిర్మాణం జరుగుతుంది. 
రైతులకు ఎంతో ఉపయోగం
 ఇంటి వద్ద నిల్వ చేసుకునే అవకాశాలు లే ని రైతులకు ఈ గోదాంలు ఉపయోగపడ్తాయి. రైతు బంధు పథకం(ఆర్‌బీపీ) ద్వారా రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. నిల్వ చేసుకున్న ధాన్యం విలువలో 70శాతం రైతుబంధు పథకం ద్వారా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. దీంతో రైతులు ధాన్యానికి మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని ఆ తర్వాత విక్రయించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఒక వేల ఆరు నెలల తర్వాత కూడా నిల్వ చేసుకుంటే మాత్రం రుణంపై వడ్డీ చెల్లించాల్సి అవసరం ఉంది.
నిల్వ చేసుకున్న రైతులు
24మంది రైతులు ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా ధాన్యాన్ని మార్కెట్‌లో నిల్వ చేసుకున్నారు. 4వేల రెండు వందల బస్తాలకు గాను రూ.31,43,000లు రుణంగా పొందారు రైతులు. ధాన్యాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బును తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులు రెండు విధాల ప్రయోజనం చేకూరినట్లవుతుంది. 
నిల్వ సామర్థ్యం పెరుగుతుంది : ఎంఏ ఘని, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌ కమిటి, నిడమనూరు
కొత్త గోదాం అందుబాటులోకి వస్తే ధాన్యం నిల్వ సామర్థ్యం మార్కెట్‌కు పెరుగుతుంది. తద్వారా రైతుల ధాన్యాన్ని మరింత నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త గోదాం నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసి అప్పగిస్తే ప్రారంభించడానికి సిద్ధం చేస్తామన్నారు.
 

Advertisement
Advertisement