తొలి టెస్ట్‌మ్యాచ్‌కు వైఎస్‌ఆర్‌ స్టేడియం రెడీ | Sakshi
Sakshi News home page

తొలి టెస్ట్‌మ్యాచ్‌కు వైఎస్‌ఆర్‌ స్టేడియం రెడీ

Published Fri, Aug 12 2016 10:58 PM

తొలి టెస్ట్‌మ్యాచ్‌కు  వైఎస్‌ఆర్‌ స్టేడియం రెడీ - Sakshi

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహణకు విశాఖలోని వైఎస్‌ఆర్‌ స్టేడియం సిద్ధమౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని హంగులతో స్టేడియం సిద్ధమెనా నేటికి  ఆ కల నేరవేరనుంది.  నవంబర్‌ 15వ తేదీన ఇంగ్లాండ్‌ జట్టుతో పాటు ఆతి«థ్యజట్టు భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఈ స్టేడియంలో ఆడేందుకు విశాఖ చేరుకోనున్నాయి.  సిరీస్‌లో భాగంగా భారత్‌ పర్యటిస్తున్న ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌ను ఇక్కడ ఆడనుంది.  నవంబర్‌ 17నుంచి ఐదు రోజుల పాటు ఈ మ్యాచ్‌ జరగనుంది. నవంబర్‌ 15 ఉదయం ప్రత్యేక విమానంలో ఇరుజట్ల ఆటగాళ్లు విశాఖ చేరుకోనుండగా...సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనున్నారు. జాతీయ జట్టులో ఆర్హత సాధించేందుకు ఎంపికగా జరిగే డొమెస్టిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లతో పాటు ఐపిఎల్, టీ20, వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వైఎస్‌ఆర్‌ స్టేడియం ఇప్పటికే వేదికగా నిలిచి... మ్యాచ్‌లను విజయవంతంగా ముగించింది. ఒక్క టెస్ట్‌ మ్యాచూ జరగలేదనే విశాఖ క్రీడాభిమానుల చింతను దూరం చేస్తూ ఆహ్వానజట్టు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిధి బందం విశాఖలోని స్టేడియాన్ని శుక్రవారం పరిశీలించింది.  స్టేడియంలో పిచ్‌లను నిశితంగా పరిశీలించింది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లకు టెస్ట్‌ మ్యాచ్‌ భిన్నం.  పిచ్‌లు సయితం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వాటి కండిషన్స్‌ ఎలా ఉన్నాయనే విషయాన్ని బందంలోని సభ్యులు జాన్‌ డొనాల్డ్, ఆంధోని ఈథర్, రినాల్డ్‌ కై ్లడ్‌ నిశితంగా పరిశీలించారు.  ఔట్‌ ఫీల్డ్, డ్రై నేజీ వ్యవçస్థలతో పాటు ప్రాక్టీస్‌ చేసుకునే నెట్స్‌ను పరిశీలించారు. అటగాళ్లకు భద్రతా విషయాలను ఏసిఏ ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు.  ఏసిఏ అధ్యక్షుడు సోమయాజులు, ఉపాధ్యక్షుడు జిజెజె రాజు, సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్, ఏసిఏ మీడియా మేనేజర్‌ మోహన్‌ తదితరులు ఇంగ్లాండ్‌ బందానికి స్టేడియంలోని వసతుల్ని వివరించారు. 

Advertisement
Advertisement