ఇండియన్ నేవీ... యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్) కింద కమిషన్డ్ ఆఫీసర్లుగా అడుగుపెట్టేందుకు చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత అభ్యర్థులు అర్హులు. బీఈ/బీటెక్ ప్రి ఫైనలియర్ వరకు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ):
పైలట్: బీఈ/బీటెక్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). పురుషులు మాత్రమే అర్హులు.
అబ్జర్వర్: బీఈ/బీటెక్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). పురుషులు మాత్రమే అర్హులు.
ఐటీ: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్ఈ/కంప్యూటర్ ఇంజనీరింగ్). పురుషులు మాత్రమే అర్హులు.
పర్మినెంట్ కమిషన్, షార్ట్సర్వీస్ కమిషన్:
టెక్నికల్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్:
ఇంజనీరింగ్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (మెకానికల్/ మెరైన్/ఆటోమొబైల్/మెకట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్/మెటలర్జీ/ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.
ఎలక్ట్రికల్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఏవియానిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.
నేవల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఏ): మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/ఏరోస్పేస్/మెటలర్జీ/నేవల్ ఆర్కిటెక్చర్. పురుషులు, మహిళలు అర్హులు.
సబ్‌మెరైన్ టెక్నికల్ షార్ట్ సర్వీస్ కమిషన్:
ఇంజనీరింగ్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (మెకానికల్/మెరైన్/ఆటోమొబైల్/మెకట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్/మెటలర్జీ/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.
ఎలక్ట్రికల్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంట్రోల్/టెలికమ్యూనికేషన్/ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 2016, జూలై 1 నాటికి 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, అవసరమైన శారీరక ప్రమాణాలుండాలి.
వేతన స్కేలు: సబ్ లెఫ్టినెంట్ నుంచి కమాండర్ స్థాయికి ఎదిగే క్రమంలో సర్వీస్ ప్రకారం వేతనం పెరుగుతుం ది. సబ్ లెఫ్టినెంట్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 5,400; లెఫ్టినెంట్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 6,100; లెఫ్టినెంట్ కమాండర్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 6,600; కమాండర్: రూ. 37,400 - రూ. 67,000, గ్రేడ్ పే రూ. 8,000. అన్ని కేడర్లకు రూ.6,000 మిలిటరీ సర్వీస్ పే ఉంటుంది. నిబంధనల మేరకు అలవెన్సులుంటాయి.
నియామక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీం ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2015 డిసెంబర్ నుంచి 2016 ఏప్రిల్ మధ్యలో ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/కోయంబత్తూరు/విశాఖపట్నంలో నిర్వహిస్తారు.
ఎస్ఎస్బీ: ఇందులో పరీక్షలను అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం పంపుతారు.
శిక్షణ : అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2016 జూన్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. యూనివర్సిటీ ఎంట్రీ స్కీం కింద ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఆఫీసర్లుగా నియమిస్తారు. 22 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సును అందిస్తారు. దీంతోపాటు నేవల్ షిప్స్, ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ప్రొఫెషనల్ శిక్షణ ఇస్తారు. జనరల్ సర్వీస్ కేటగిరీలో ఎగ్జిక్యూటివ్ ఎంట్రీకి ఎంపికైన అభ్యర్థులకు 44 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది.
సబ్‌మెరైన్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ పొందుతారు. సబ్‌మెరైన్ క్వాలిఫైయింగ్ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఇందులో అనర్హులైన వారిని సర్వీస్‌కు ఎంపిక చేయరు.
{పొబేషన్: అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై, సర్వీస్‌కు ఎంపికైన వారిని తొలుత సబ్‌లెఫ్టినెంట్ కేడర్‌లో నియమిస్తారు. వీరికి రెండేళ్లు ప్రొబేషన్ ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19, 2015.
ఒకటి కంటే ఎక్కువ కేడర్లకు అర్హులైనప్పటికీ ఒకటే దరఖాస్తు పంపాలి. అయితే వాటిలో ప్రాధాన్యతలను సూచించాలి.
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
ఇండియన్ నేవీ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్..
Published Thu, Jul 2 2015 3:21 AM
# Tag
Related news
-
అంతులేని అభిమానం సీఎం జగన్ పై విశాఖ ప్రజలు పూల వర్షం
అంతులేని అభిమానం సీఎం జగన్ పై విశాఖ ప్రజలు పూల వర్షం -
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్‌లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్‌గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్‌మోడల్ స్టేట్‌గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
స్కూల్ నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్
స్కూల్ నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్ -
భవిత ప్రాముఖ్యత అందుకోసమే.. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నాం
భవిత ప్రాముఖ్యత అందుకోసమే.. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నాం -
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి.
Related News by category
-
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్‌లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్‌లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్‌లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్‌లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
ఈ రంగంలో అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు మీ సొంతం
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్.. అర్హతలుంటే కొలువులు ఖాయం చేస్తున్న రంగం. ఎంట్రీ లెవల్ మొదలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వరకూ.. చక్కటి ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల ఈ రంగం టెక్నికల్ నుంచి స్పెషలైజ్డ్ జాబ్ ప్రొఫైల్స్ వరకూ.. భారీగా నియామకాలు చేపడుతోంది! ఉద్యోగార్థులు.. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫైనాన్షియల్ సేవల రంగంలో తాజా రిక్రూట్మెంట్ ట్రెండ్స్.. కొలువులు..అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. కరోనా పరిణామాల్లో అంతా డిజిటలైజేషన్ బాట పట్టారు. దాంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ సెక్టార్ పరిధిలోకి వచ్చే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, బీఎఫ్ఎస్ఐ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ.. ఇలా అన్నింటిలోనూ కార్యకలాపాలు తిరిగి వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ.. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లోని సంస్థల్లో నమోదైన నూతన నియామకాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అందుకే కొలువులు గత కొంత కాలంగా అనేక సంస్థలు స్టాక్ మార్కెట్లో ఐపీఓల బాటపట్టాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రయివేట్ ఈక్విటీ సంస్థలకు నిధులు భారీగా వస్తున్నాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు సంస్థలు టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించడంపై దృష్టిపెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం సైతం విస్తరిస్తోంది. ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో నియామకాల జోరుకు కారణాలుగా చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగా సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ..ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. జూనియర్, మిడిల్ లెవల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో.. జూనియర్, మిడిల్ లెవల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కరోనా ముందుకాలం నాటి ఆఫర్స్‌తో పోల్చుకుంటే.. సగటున 30 నుంచి 50 శాతం మేర కొత్త కొలువులు లభించాయి. జూనియర్ లెవల్లో 1 నుంచి 4ఏళ్ల అనుభవం ఉన్న వారిని, మిడిల్ లెవల్లో అయిదు నుంచి 13ఏళ్ల అనుభవం ఉన్న వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి. బీఎఫ్ఎస్ఐ.. ఎవర్గ్రీన్ ఫైనాన్షియల్ సెక్టార్ అనగానే గుర్తుకొచ్చే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) సెక్టార్‌లోని సంస్థలు.. రిక్రూట్మెంట్స్లో ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో పోలిస్తే.. 2021 సెప్టెంబర్ నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 43 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టాలెంట్ కొరత ఫైనాన్స్ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. కంపెనీలకు అవసరమైన టాలెంట్ కొరత నెలకొన్నట్లు చెబుతున్నారు. నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు కంపెనీలు, స్టాఫింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంది. వేతనాలు ఆకర్షణీయం నైపుణ్యాలున్న వారికి ఫైనాన్షియల్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. జూనియర్ లెవల్లో సగటున రూ.8లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో రూ.18లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఫైనాన్షియల్ రంగం.. జాబ్ ట్రెండ్స్.. ముఖ్యాంశాలు ► ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీగా నియామకాలు. ► జూనియర్, మిడిల్ లెవల్లో 30 నుంచి 50 శాతం వరకూ పెరుగుదల. ► జూనియర్ లెవల్లో రూ.8 లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో సగటున రూ.18 లక్షల వరకు వేతనాలు. ► సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ–ఎంఎల్ నిపుణులకు డిమాండ్. రీసెర్చ్ అనలిస్ట్ ఫైనాన్షియల్ రంగంలో ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, ఈక్విటీ, ట్రేడింగ్ సంస్థల్లో కీలకంగా నిలుస్తున్న జాబ్ ప్రొఫైల్.. రీసెర్చ్ అనలిస్ట్. ఆయా స్టాక్స్‌కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు వాటి సానుకూలతలు, ప్రతికూలతల గురించి సూచించడం.. క్లయింట్ల కోసం ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్పై విశ్లేషణ వీరి ప్రధాన విధులు.ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు.. ఎంబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్టులుగా నియమించుకుంటున్నాయి. ఫండ్ మేనేజర్ ఆయా ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి సందర్భంలో సదరు సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక ఫలితాలు, లాభనష్టాలు, డివిడెండ్స్.. భవిష్యత్‌లో ఆ సంస్థల పనితీరు ఎలా ఉండబోతోంది వంటి అంశాలను విశ్లేషించి.. ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫండ్లలో పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను ఒప్పించడం వంటి కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు.. ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న వారికి ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల నిర్వహణ.. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల ప్రధాన విధి. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్‌ఫోలియో సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్, పనితీరు, నియంత్రణ,క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. సంస్థలు కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌తో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ నిపుణులకు అవకాశం ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు.. ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్‌లో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఫలితంగా బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ రంగంలో కొలువులు లభిస్తున్నాయి. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, చెల్లించే సామర్థ్యం, వయసు తదితరాలు గణించి.. పాలసీకి అర్హతలు నిర్ణయించే వారే..యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్. వీరికి బీమా సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. యాక్చుయేరియల్ సొసైటీ నిర్వహించే కోర్సుల ఉత్తీర్ణులకు ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అండర్ రైటర్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లో మరో కీలకమైన కొలువు..అండర్ రైటర్స్. ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకోవాలనే ప్రతిపాదన చేసినప్పుడు.. దాన్ని పరిశీలించి, సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతారో లేదో నిర్ణయించడం వీరి ప్రధాన విధి. ప్రత్యేక అర్హతలున్న వారికే సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందించే అసోసియేట్ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. రిస్క్ అనలిస్ట్స్ నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో.. పాలసీ చేయాలనుకున్న వస్తువులు లేదా నిర్మాణాలను పరిశీలించి.. వాటి జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రిస్క్ అనలిస్ట్‌లు నివేదికలు ఇస్తారు. సదరు నివేదిక ఆధారంగానే సంస్థ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ క్లెయిమ్‌ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగిందని.. ఆ కారణంగా బీమా చెల్లించాలనే విషయంపై తుది నిర్ణయం వీరిచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్స్.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. బ్యాంకింగ్‌లో అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో.. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో సంప్రదింపులు సాగించే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మొదలు ఉన్నత స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వరకూ.. అనేక రకాల అవకాశాలు లభిస్తున్నాయి. బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, కార్పొరేట్ బిజినెస్ సేల్స్ మేకర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రిస్క్ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్షియల్ ప్లానర్ వంటి ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో అందుకోవచ్చు. -
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లర్క్ కొలువుల పిలుపు
బ్యాంకింగ్ రంగం.. ఒక్కసారి కొలువుదీరితే.. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు! చక్కటి వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన!! అందుకే.. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.. ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడు వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షల విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం... ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల వరకూ.. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేల సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్–11(సీఆర్పీ క్లర్క్స్–11) పేరిట 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 బ్యాంకులు ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11 ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణలో 333 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడొచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు సంబంధించి.. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హతలు ► అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. (జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి). ► ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు. రెండంచెల రాత పరీక్ష ఐబీపీఎస్ క్లర్క్స్ ఎంపిక ప్రక్రియ.. రెండంచెల రాత పరీక్ష విధానంలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్ అందిస్తారు. తుది ఎంపికలో మెయిన్పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11(2022–23) రాత పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు, ఉర్దూ ఉన్నాయి. వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుందని.. అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీపీఎస్‌కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రిలిమినరీ పరీక్ష ఇలా ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20 ని. న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20 ని రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 ని మొత్తం 100 100 60 నిమిషాలు (ఒక గంట) మెయిన్ పరీక్ష విధానం ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆ వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 50 35 ని ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 35 ని రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 60 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం 190 200 160 ని ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. ఆ తర్వాత మెయిన్ జనవరి/ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్‌కు దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. రెండింటికీ కలిసొచ్చేలా ప్రిలిమ్స్, మెయిన్‌కు సంబంధించి మూడు విభాగాలు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా ఉంటుంది. మెయిన్‌లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో ఉండే ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్‌లోని న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్‌లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలపై పూర్తిగా పట్టుసాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపైనా అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ అదనపు అంశాలపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు.ఎందుకంటే..ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్‌కు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. తక్కువ సమయంలో మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్ట సాధ్యంగా మారుతుంది. జనరల్ అవేర్నెస్/ఫైనాన్షియల్ అవేర్నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు, పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్లోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్‌పై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్.. రెండు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ విధానంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్‌లను ఎంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్‌లకు ఆన్‌ౖలైన్ విధానంలో హాజరైతే సబ్జెక్ట్ నైపుణ్యాల్లో సామర్థ్యంతోపాటు, ఆన్లైన్ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది. క్లర్క్ కొలువుతో.. డీజీఎం వరకు ► ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది. ► కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్(ఎఎంజీఎస్–ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు నేరుగా జేఎంజీఎస్ స్కేల్–1 ఆఫీసర్‌గా పదోన్నతి పొందొచ్చు. ► క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించాక జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్‌గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా డీజీఎం హోదాలో మూడేళ్ల అనుభవంతో జీఎంగా.. మరో మూడేళ్ల అనుభవంతో సీజీఎంగా.. ఆ తర్వాత మూడేళ్ల అనుభవంతో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై12–14, 2021లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి/ఫిబ్రవరి 2022 ► ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2022 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in -
కొత్తగా పదో తరగతిలో చేరిన విద్యార్థులకు గుడ్‌న్యూస్..
సాక్షి, ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి జాయిన్ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్.సాక్షి.కామ్ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. పదో తరగతి సిలబస్ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్ బుక్స్ కావాలంటే ఎలా..? పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? పదో తరగతి తర్వాత బెస్ట్ కెరీర్ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక education.sakshi.com. పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం ఉచితంగా ఎడ్యుకేషన్.సాక్షి.కామ్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్ మొదలైనవి ప్రిపేర్ చేశారు. అలాగే గైడెన్స్ వీడియోలు, తాజా టెన్త్ క్లాసు సమాచారం కూడా ఈ కొత్త వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే education.sakshi.comలో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి. ఏపీ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి తెలంగాణ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
- అమరజీవికి అవమానం
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్‌దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్‌లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement