Sakshi News home page

రాయలసీమ కన్నీటి బాధలను వినిపించే కావ్యం?

Published Sun, Oct 5 2014 10:31 PM

Rayalaseema classic tear woes?

ఆధునిక సాహిత్య ఉద్యమాలు- ధోరణులు
 
భావ కవితా ఉద్యమం:
20వ శతాబ్దిలో ఆంగ్ల కవిత్వంలోని రొమేంటిసిజమ్ (కాల్పనిక వాదం) ప్రభావంతో భావ కవితా ఉద్యమం మొదలైంది. ఆంగ్ల కవులైన షెల్లీ, కీట్స్, బైరన్, వర్‌‌డ్స వర్‌‌త, బ్లేక్ మొదలైన వారి ప్రభావంతో రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ, దువ్వూరి, తల్లా వజ్జల తదితర కవులు అభినవ కవిత్వం, కాల్పనిక కవిత్వం వంటి పేర్లతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కవి కొం డల వెంకటరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి వంటి వారు భావ కవిత్వాన్ని నిర్వచించారు. భావ ప్రాధా న్యం ఉన్న కవిత్వం భావకవిత్వం అని నిర్ధా రించారు.
 తొలిసారిగా భావ కవిత్వమనే పదాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు (1906) ప్రయో గించారు. అప్పటి నుంచి 1940 వరకు వివిధ శాఖలతో భావకవిత్వం విలసిల్లింది. ప్రణయ, ప్రకృతి, ఆధ్యాత్మిక, దేశభక్తి, సంఘసంస్కరణ, స్మృతి, మానవతా కవిత్వాలు భావ కవిత్వ శాఖలుగా ఏర్పడ్డాయి.

అభ్యుదయ కవితా ఉద్యమం:
ఆంగ్లంలోని ప్రొగ్రెసివ్ పోయెట్రీ ప్రభావంతో, సమసమాజ నిర్మాణ లక్ష్యంతో, వర్గ సంఘర్షణ ధ్యేయంతో అభ్యుదయ కవితా ఉద్యమం ప్రారంభమైంది. 1943లో తాపీ ధర్మారావు అధ్యక్షతన తెనాలిలో ప్రారంభమైన అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్ర, శ్రీశ్రీ, సోమసుందర్, కుందుర్తి ఆంజనేయులు, బెల్లం కొండ రామదాసు వంటి కవులు పాల్గొన్నారు.

పి.వి.రాజమన్నారు, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివారు అభ్యుదయ కవితా స్వరూపాన్ని నిర్వచించారు. వర్గ సంఘర్షణ సమసమాజ నిర్మాణం లక్ష్యంతో రాసేది అభ్యుదయ సాహిత్యమని నిర్ధారించారు.

అభ్యుదయ కవితా లక్షణాలు:
వర్గ సంఘర్ణణ, విప్లవ ప్రబోధం, వీరగాథ కథనం, యుద్ధ విముఖత- శాంతి కాముకత, సమసమాజ నిర్మాణం,   తెలంగాణా విముక్తి, ఆంధ్ర రాష్ర్ట ఉద్యమ ప్రబోధం అభ్యుదయ కవితా లక్షణాలు.

1950 తర్వాత కమ్యూనిస్టు పార్టీపై నిషేధంతో అభ్యదయ కవులందరూ సినీరంగాన్ని ఆశ్రయించారు. ఉద్యమం నిర్వీర్యమైంది. 1955లో కె.వి.రమణారెడ్డి అ.ర.సం. పునరుద్ధరణ సభలు నిర్వహించినా ఫలితం లేదు.
 
దిగంబర కవితా ఉద్యమం:
అభ్యుదయ కవితా ధోరణిపై తిరుగుబాటుగా సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువల పట్ల కసి, అక్కసుతో 1965లో దిగంబర కవితా ఉద్యమం ఆరంభమైంది. నగ్నముని, నిఖిలేశ్వర్, మహాస్వప్న, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్యలు దిగంబర కవులుగా ప్రకటించుకున్నారు. ప్రాచీన ఛందస్సును, ప్రబంధ కవిత్వాన్ని, అకాడమీలను, సెక్స్ సాహిత్యాన్ని నిరసించారు.
 
ఈ కవితా ఉద్యమం కేవలం మూడు సంపుటాల ప్రచురణతో నిర్వీర్యమైంది. మొదటి సంపుటిని 1965 మే 6న అర్ధరాత్రి హైదరాబాద్‌లో నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు ఆవిష్కరించాడు. రెండో సంపుటిని 1966 డిసెంబర్ 8న విజయవాడలో జంగాల చిట్టి అనే హోటల్  కార్మికుడు ఆవిష్కరించాడు. మూడో సంపుటిని విశాఖ పట్టణంలో 1968 జూన్‌లో ‘ఎడనూరి యశోద’ అనే యాచకురాలు ఆవిష్కరించింది. భారతీయ సంస్కృతి దుర్గంధ భూయిష్టంగా, రాజకీయాన్ని  కుష్ఠు వ్యవస్థగా వర్ణించి ప్రజాగ్రహానికి గురై ఉనికిని  కోల్పోయింది.
 
విప్లవ కవితా ఉద్యమం:
శ్రీకాకుళం గిరిజన పోరాట నేపథ్యంలో శ్రీశ్రీ షష్టిపూర్తి అనంతరం 1970 జులై 3న శ్రీశ్రీ అధ్యక్షుడుగా, కె.వి.రమణారెడ్డి కార్యదర్శిగా వి.ర.సం. ఏర్పడింది.
విప్లవాన్ని సమర్థిస్తూ, విప్తవోద్యమ చరిత్రను ప్రతిఫలిస్తూ, విప్లవ భావాలను ప్రచారం చేస్తూ రాసేదే విప్లవ కవిత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే విప్లవం వస్తువుగా వచ్చే కవిత్వమే విప్లవ కవిత్వం’ అని విప్లవ సాహిత్య స్వరూపాన్ని వివరిస్తూ డాక్టర్ కాత్యాయినీ విద్మహే అభిప్రాయపడ్డారు.
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝను ప్రసరిస్తాను మంటలచేత మాట్లాడించి రక్తంచేత రాగాలాపన చేయిస్తానని విప్లవ కవి శ్రీశ్రీ ప్రకటించాడు.

విప్లవ కవితా లక్ష్యాలు:
నిర్దిష్ట జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు ప్రతిస్పందనగా ఉంటుంది.

వివిధ వర్గాల ప్రజలను సమీకరించి వాళ్ల జీవన సమస్యలపై చైతన్యాన్ని పెంపొం దించే విధంగా కవిత్వీకరించడం
విప్లవోద్యమంలో మరణించిన విప్లవ వీరులను సంస్మరిస్తూ, కీర్తిస్తూ, కవిత్వం రాయడం.
సకల మానవ సంబంధాలను విప్లవీకరించి కవిత్వం రాయడం.
విప్లవ కవితా సంపుటాలు:
ఝంఝ (1970): శ్రీకాకుళం గిరిజన పోరాటంలో చనిపోయిన నక్సలైట్ నాయకుల స్మృతిగీతాల సంపుటి.
మార్‌‌చ: ‘బ్యాలెట్‌తో కాదు/ బుల్లెట్‌తో రాజ్యా ధిపత్యం చేపట్టండి’ అనే నినాదంతో వెలువడింది.

దీనికి పి. కిషన్‌రావు సంపాదకులు
‘లే’: గద్దర్, వంగపండు, చెరబండరాజుల కవితా సంకలనం. ఈ మూడు సంపుటాలను ప్రభుత్వం నిషేధించింది.
విప్లవ సాహిత్య పత్రికలు:
అరుణతార, సృజన, విమోచన, ఎర్రగడ్డ, పిలుపు, ప్రభంజనం మొదలైనవి విప్లవ సాహిత్య పత్రికలు.
 
భావ కవులు    -    కవితా సంపుటాలు
దేవులపల్లి  కృష్ణశాస్త్రి    -    కృష్ణ పక్షం, ఉర్వశి ప్రవాసం
రాయప్రోలు సుబ్బారావు    -    లలిత, తృణకంకణం, స్నేహలత,
(అమలిన శృంగార సిద్ధాంత కర్త)        కష్టకమల
విశ్వనాథ సత్యనారాయణ    -    కిన్నెరసాని పాటలు, వరలక్ష్మీ త్రిశతి
నాయుని సుబ్బారావు    -    సౌభద్రుని ప్రణయ యాత్ర
తల్లా వజ్జల శివశంకర శాస్త్రి    -    హృదయేశ్వరి
వేదుల సత్యనారాయణశాస్త్రి    -    దీపావళి
 
ప్రముఖ అభ్యుదయ కవులు - కవితా సంపుటాలు
కవులు    - కవితా సంపుటాలు
అనిశెట్టి     - అగ్నివీణ (1949)
దాశరథి    - అగ్నిధార (1949),
            రుద్రవీణ (1950)
శ్రీశ్రీ        - మహాప్రస్థానం (1950)
సోమసుందర్     - వజ్రాయుధం (1950)
పుట్టపర్తి     - పురోగమనం (1951)
కుందుర్తి ఆంజనేయులు    - తెలంగాణ (1953)
కె.వి. రమణారెడ్డి     - భువన ఘోష (1955)
గంగినేని వెంకటేశ్వరరావు    - ఉదయిని (1950)
రెంటాల గోపాలకృష్ణ     - సంఘర్షణ (1953)
గజ్జెల మల్లారెడ్డి     - శంఖారావం (1960)
 
మాదిరి ప్రశ్నలు
 1.    కవి స్వీయానుభూతి వర్ణనకు ప్రాధాన్యం ఉన్న కవిత్వం?
     1) వస్త్వాశ్రయ     2) ఆత్మాశ్రయ
     3) పరాశ్రయ     4) వైయక్తిక
 2.    1930లో తల్లా వజ్జల ‘హృద యేశ్వరి మా ఉద్గ్రంథం’ అని చెప్పిన కవి?
     1) కరుణశ్రీ   2) దేవులపల్లి
     3) శ్రీశ్రీ       4) నాయని సుబ్బారావు
 3.    తెనుగుతల్లి పదాన్ని తొలిసారిగా ప్రయో గించిన కవి?
     1) రాయప్రోలు     2) జాషువా
     3) తుమ్మల     4) దువ్వూరి
 4.    గురజాడ దేశభక్తి గీతాన్ని విశ్వమానవ గీతంగా ప్రశంసించిన కవి?
     1) శ్రీశ్రీ     
     2) డాక్టర్ సి. నారాయణ రెడ్డి
     3) ఆరుద్ర  4) కృష్ణశాస్త్రి
 5.    ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అంటూ స్వేచ్ఛా ప్రీతిని ప్రకటించిన కవి?
     1) వేదుల సత్యనారాయణ
     2) నాయని సుబ్బారావు
     3) దేవులపల్లి కృష్ణశాస్త్రి
     4) విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి
 6.    ఆంధ్రాస్కాట్ బిరుదున్న కవి ఎవరు?
     1) పానుగంటి     2) చిలకమర్తి
     3) దేవులపల్లి    4) రాయప్రోలు
 7.    బసవరాజు రాజ్యలక్ష్మమ్మ కలం పేరు?
     1) సౌదామిని     2) శారద
     3) వసంత     4) కమల
 8.    భావ ప్రధాన కవిత్వమే భావ కవిత్వం అని చెప్పిన వారు?
     1) కవి కొండల వెంకట రావు
     2) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
     3) శ్రీశ్రీ    
     4) డాక్టర్ సి. నారాయణ రెడ్డి
 9.    రాయప్రోలు ‘అనుమతి’ కావ్యానికి ఆంగ్ల మాతృక?
     1) హెర్మిట్     2) డోరా
     3) లీవ్‌‌స ఆఫ్ గ్రాస్     4) డాఫిడల్స్
 10.    జాషువా రచనల్లో కేంద్ర సాహిత్య అకా డమీ బహుమతి పొందిన గ్రంథం?
     1) గబ్బిలం        2) ఫిరదౌసి
     3) క్రీస్తు చరిత్ర    
     4) ముంతాజ్‌మహల్
 11.    విశ్వనాథ ‘శ్రీమద్రామాయణ కల్ప వృక్షం తిరుపతి లడ్డు వంటిది’ అని వ్యాఖ్యా నించిన కవి?
     1) శ్రీశ్రీ       2) జరుక్ శాస్త్రి
     3) ఆరుద్ర    4) వేటూరి ప్రభాకర శాస్త్రి
 12.    ‘రాజు జీవించు రాతి విగ్రహములందు
     సుకవి జీవించు ప్రజల నాలుకలయందు’    
     అని చెప్పిన కవి?
     1) తుమ్మల     2) జాషువా
     3) దువ్వూరి     4) కరుణశ్రీ
 13.    తొలి అభ్యుదయ కవితా సంపుటి
     1) నయాగరా     2) మహాప్రస్థానం
     3) అగ్నివీణ     4) అగ్నిధార
 14.    ‘పీడింపబడే వాళ్లూ పీడించే వాళ్లున్న యీ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటించేవారు ఎప్పుడూ అభ్యుదయ వాదులు కాజాలరు’ అని పేర్కొన్నవారు?
     1) శ్రీశ్రీ            2) దేవులపల్లి
     3) పి.వి. రాజమన్నారు   4) ఆరుద్ర
 15.    కవితా పుష్పకం రచించిన కవి?
     1) కాళోజీ     2) శేషేంద్రశర్మ    
     3) దాశరథి     4) భీమన్న
 16.    రాయలసీమ కన్నీటి బాధలను వినిపించే కావ్యం?
     1) నాగులేటి పాట     2) పెన్నేటి పాట
     3) మేఘదూతం    4) చితీ- చింత
 17.    కింది వాటిలో అభ్యుదయ కవితా లక్షణం కానిది?
     1) వర్గ సంఘర్షణ     
     2) వీరగాథ కథనం
     3) స్మృతి కవిత్వం     
     4) విప్లవ ప్రబోధం
 18.    నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన కవి?
     1) దాశరథి    2) శ్రీశ్రీ
     3) కాళోజీ     4) గంగినేని
 19.    ‘అణ్వహంకారంతో కావరమెక్కిన అగ్రరాజ్యశ్యేనాలకు రెక్కలు నరికి ఈకలు పెరికి చూపాలనుంది’ అని నిరసించిన కవితా ఉద్యమం?
     1) అభ్యుదయ     2) దిగంబర
     3) విప్లవ    4) పైగంబర
 20.    ‘గుండె గుండెకు చిచ్చు మండించండి, గుడిసె గుడిసెకు కోట నిర్మించండి’ అంటూ పీడిత ప్రజలను ప్రబోధించిన కవి?
     1) శ్రీశ్రీ     2) దాశరథి
     3) అనిశెట్టి     4) ఆరుద్ర
 21.    నా గొడవ కవితా సంపుటి కర్త ?
     1) కాళోజీ     2) బోయి భీమన్న
     3) సోమసుందర్     4) దాశరథి
 22.    డాక్టర్ సి. నారాయణ రెడ్డి కావ్యం?
     1) రుద్రవీణ     
     2) కర్పూర వసంతరాయలు
     3) మేఘదూతం
     4) త్వమేవహం
 
 సమాధానాలు:
 1) 2;    2) 3;     3) 1;     4) 2;    
 5) 3;    6) 2;      7) 1;      8) 2;    
 9) 2;    10) 3;    11) 4;     12) 3;    
 13) 1;     14) 2;     15) 3;     16) 2;
 7) 3;     18) 1;     19) 2;     20) 3;
 21) 1;     22) 2.

Advertisement

What’s your opinion

Advertisement