ఫ్యాన్ హవా | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ హవా

Published Wed, May 7 2014 2:52 AM

huge response to YSRCP party

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన ఆల్‌ఫ్రీ హామీలపై అపనమ్మకం. అధికార పగ్గాలు చేతికి చిక్కగానే ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయే గజినీ వ్యవహారం. బీజేపీతో పొత్తు పెట్టుకోనే పెట్టుకోను అని పబ్లిక్‌గా లెంప లేసుకుని మళ్లీ ఆ పార్టీ పొత్తు కోసం వెంపర్లాడిన తీరు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలక్చిన మాట కోసం ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా పోరాడుతున్న నైజం. ఆయన మాట మీద నిలబడి తీరుతారనే నమ్మకం. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచించి అనేక పనులు చేసిన రాజన్న రాజ్యం మళ్లీ రావాలనే జనం కోరిక. ఈ  పరిస్థితులన్నీ జిల్లాలో ఫ్యాన్ హవా పెంచాయి.  
 
 గెలుపు తమదేనని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధైర్యంగా పోలింగ్ యుద్ధానికి సన్నద్ధమైతే, ఫలితం మీద నిరాశతో టీడీపీ అభ్యర్థులు ఓటరు తీర్పునకు రెడీ అయ్యారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ధాటికి తట్టుకోవడం ఎలా అనే భయంతో టీడీపీ అభ్యర్థులు సొంత పార్టీ అభ్యర్థులకే వెన్నుపోట్లు పొడుస్తూ ఎదుటి వారి సంగతి మాకొద్దు, మాకొక్కరికి ఒక ఓటు వేస్తే చాలు అని ఓటర్లను బతిమలాడే రాజకీయానికి తెరలేపారు. నెల్లూరు లోక్‌సభ బరిలోకి దిగిన మేకపాటి రాజ మోహన్‌రెడ్డికి వైఎస్ జగన్‌కు జనం అందిస్తున్న ఆశీస్సు లు కొండంత అండగా నిలి చాయి. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాద్‌కు కానుకగా ఇవ్వడం ఖాయమనే అభిప్రా యం టీడీపీ, బీజేపీలలో బలంగా నాటుకుంది.
 
 అసెంబ్లీ స్థానాల్లోనూ అదే పరిస్థితి
 ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి జోరుకు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డే తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ అభ్యర్థి కన్నబాబు బరిలో ఉన్నామంటే ఉన్నామనేలా వ్యవహరిస్తున్నారు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డికి జనంతో విపరీతమైన సంబంధాలు ఉండడం, జగన్‌పై అభిమానం వెల్లువెత్తుతుండటంతో ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు నామమాత్రపు పోటీనే ఇస్తున్నారు. కావలిలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో పాటు కావలి పట్టణంలో బలమైన సామాజిక వర్గ నేతల మద్దతు సంపాదించారు.  ఈ జోరు చూసిన టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు వారంరోజుల ముందే నిర్వేదంలో పడ్డారు.
 
 కోవూరులో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని సొంత పార్టీ నేతలే ప్రచారానికి రానివ్వని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి రెండేళ్లుగా రోజూ ప్రజల మధ్యే గడుపుతున్న తీరు ఆయనకు ఊహించని బలం తెచ్చి పెట్టింది. నెల్లూరు సిటీలో  పెద్దసంఖ్యలో ఉన్న ముస్లింలంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలవడం, పార్టీ అభ్యర్థి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్‌కు ప్రజల్లో  సానుభూతి కలసి రానున్నాయి. టీడీపీలోని అంతర్గత   కుమ్మక్కు రాజకీయాలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డికి ఊహించని దెబ్బకొట్టబోతున్నాయి. నెల్లూరు రూరల్‌లో బీజేపీ ప్రభావం నామమాత్రంగా ఉండటం, టీడీపీ సహాయ నిరాకరణకు దిగడం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అదనపు బలం తెచ్చి పెట్టాయి. సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డి రెండేళ్ల నుంచి రెండు, మూడు సార్లు ప్రతి ఇంటి గడప ఎక్కి ఓటు కోరడంతో జనానికి దగ్గరయ్యారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ నియోజక వర్గం నుంచి అయిష్టంగా పోటీకి దిగడంతో జనం ఆయన్ను నమ్మడం లేదు. గూడూ రులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సునీల్‌కుమార్ రెండే ళ్లుగా జనంతో సన్నిహితంగా మెలుగుతూ రావడం, వైఎస్ జగన్ హవా ఆయన విజయానికి సోపానాలు కానున్నాయి.
 
 వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో తలపడి గెలవడం సాధ్యమయ్యేలా లేదని టీడీపీ అభ్యర్థి రామకృష్ణ పది రోజుల కిందటే కాడి కిందపడేశారు. సూళ్లూరుపేటలో పరసారత్నం గెలవలేరనే విషయం తెలిసే చంద్రబాబు చివరి దాకా టికెట్ ఇవ్వలేదు. దీనికితోడు పార్టీలోని అంతర్గత విభేదాలు ఆయనకు ప్రతిబంధకాలయ్యాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ గాలి వీస్తుండటం, అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కొత్తవ్యక్తిగా జనంలోకి వెళ్లడ ంతో అందరూ ఆదరిస్తున్నారు.
 
 టీడీపీ ఇటీవల జరిపిన అంతర్గత సర్వేల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా బోణీ కాదనే ఫలితాలు రావడం ఆ పార్టీ అభ్యర్థులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి.
 

Advertisement
Advertisement