కన్నీటి వలసకు కారణాలెన్నో.. | Sakshi
Sakshi News home page

కన్నీటి వలసకు కారణాలెన్నో..

Published Wed, Mar 26 2014 1:22 AM

కన్నీటి వలసకు కారణాలెన్నో.. - Sakshi

గెస్ట్ కాలమ్: వలస ఇప్పటిది కాదు.. రూపం వేరైనా ఆదిమ కాలం నుంచే ఉంది.  దేశానికి స్వాతంత్య్రం వచ్చాక  వలసలు విభిన్నంగా సాగాయి. వ్యవసాయ విప్లవం మూలంగా దిగుబడులు పెరిగి వ్యవసాయాధారిత ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. అప్పుడే వృత్తి మార్పిడి జరిగింది. ఒక వృత్తి నుంచి మరొక వృత్తిలోకి మారే క్రమంలో పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. ఇంత మందికి పట్టణాలు ఉపాధి చూపలేక పోయాయి. కేవలం మట్టినే నమ్ముకున్న రైతులకైతే పట్టణాల్లో నిలువ నీడలేకుండా పోయింది. అప్పుడు పడింది రైతు కూలీల కన్ను గల్ఫ్ దేశాల పైన.
 
 తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదట వలస పోయింది చేనేత కార్మికులే. 18వ శతాబ్దంలో ఈ వలస షోలాపూర్, భీవండి, బాంబే, సూరత్ లాంటి పట్టణాలకు పాకింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక 1970లో కరువుతో తెలంగాణ పల్లెలు అతలాకుతలమైనాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయట పడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకుదెరువు లేని రైతులకు  అది మంచి అవకాశం అయింది. దీంతో గల్ఫ్‌కటు వలసలు వేగవంతమయ్యాయి.   
 
 ఏజెంట్ వ్యవస్థ...
 వలసలతో పాటే ఏజెంట్ వ్యవస్థ మొదలైంది. అమాయకపు కూలీలు, రైతుల బలహీనతను ఆధారం చేసుకొని పుట్టగొడుగుల్లా ఏజెంట్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. నకిలీ ఏజెంట్లు కమీషన్‌ల మీద వ్యక్తులను కంపెనీలకు అమ్ముకునేవారు.  వ్యక్తి వద్ద పాస్‌పోర్టు, అడ్వాన్సు తీసుకొనేవారు. నెలలో తోలి స్తామని సంవత్సరాలు గడిపేవారు. బొంబా యి చుట్ట్టూ తిరిగి తిరిగి యాష్టకచ్చి కచ్చితంగా అడిగితే పాస్‌పోర్టు మాత్రమే ఇచ్చేవారు.   
 
 ఖల్లి వళ్లి.....
 ఈ మధ్య బాగా వింటున్న పదం ఇది. బోగస్ వీసా మీదనో గ్రూపు వీసా మీదనో , విజిటింగ్ వీసా మీదనో గల్ఫ్ వెళ్లిన వారికి అక్కడ ఉపాధి దొరకదు. కంపెనీ జీతం సరిగా ఇవ్వకుండనో, లేక మధ్యలోనే కంపెనీ మూత పడితేనో ఇంటికి వెళ్లడం ఇష్టంలేనివారు దొంగచాటుగా ఏదో పని చేసుకొని బతుకుతారు. ఇదే ఖల్లివళ్లి.  అరబ్బీ పదం. అంటే కాట కలిసి పోవడ ం అన్నట్టు. పొరపాటునా అక్కడి పోలీసులకు దొరికితే జైలు పాలే. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ జైళ్లలో నాలుగు లక్షల మంది ఉన్నట్టు అంచనా. అందులో అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లా వాసులే. తెలంగాణ పల్లెల్లో గల్ఫ్‌కు వెళ్లని వారులేని ఇల్లు లేదు. కన్నీరు కారని ఊరు లేదు. ఒక మనిషి చనిపోతే పాడె మోసే మగవారులేక ట్రాక్టర్‌లో శవాన్ని తీసుకెళ్లిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్‌లో చనిపోయి ఏడాది దాక శవం ఇంటికి రాకపోతే ఈ ఏడాది పాటు  ఇరుగుపొరుగు ఇండ్లకు కూడా పోకుండా ఏడ్చిన కుటుంబాలు ఎన్నో. భర్తను జైలు నుంచి విడిపీయడానికి కిడ్నీలు అమ్ముకునే అను మతి కావాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన వాళ్లు న్నారు.  
 
 నవ నిర్మాణంలో వలస...
 ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వలసలు ఉన్నాయి. కానీ కోస్తాంధ్ర నుంచి చదువుల కోసమో ఉద్యోగం కోసమో అమెరికాకో, ఆస్ట్రేలియాకో వలసపోతే సీమ నుంచి, తెలంగాణ నుంచి బతుకు దెరువు కోసం దుబాయి, మస్కట్, సౌదీ, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలకు వలసపోయారు. ఇందుకు కారణం కరువు, నిరుద్యోగం,  ఉపాధి హామీ లాంటి కంటి తుడుపు చర్యలు పనిచేయవు. ఉపాధి కల్పన పెరగాలి. ప్రాజెక్టులు కట్టాలి. పరిశ్రమలు పెరగాలి. ఉపాధి కల్పించే నూతన విద్యావిధానం అందుబాటులోకి తేవాలి. అతి ముఖ్యమైన విషయం వలసలను క్రమబద్ధీకరించాలి. ఏజెంట్లకు లెసైన్సులు ఇచ్చి వలసకు భద్రత కల్పించాలి.  రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసి ఆయా దేశాల్లో ఉన్న ఖైదీలను విడిపించాలి.  
 - పెద్దింటి అశోక్‌కుమార్, రచయిత
 
 ‘గల్ఫ్’ ఓట్లూ కీలకమే
 ముహ్మద్ మంజూర్: విదేశాల్లో నివసిస్తున్న మన రాష్ట్ర ఓటర్లు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నారు. తెలంగాణ జిల్లాల్లోని హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. ఎన్నికల్లో వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయ నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని కల వేళ వీరంతా స్వగ్రామాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగిం చుకుంటుంటారు. ఇందుకోసం వారు పనిచేస్తున్న కంపెనీల్లో సెలవుల కోసం ముందుగానే దరఖాస్తు చేసు కుంటారు. స్వస్థలాలకు వెళ్లేందుకు సెలవు కావాలని ఇంతకుముందే కంపెనీలో దరఖాస్తు చేసుకున్నట్టు జెడ్డాలో నివసిస్తున్న కరీంనగర్ జిల్లావాసి అబ్దుల్ రవూఫ్ తెలిపా రు. తాము పరాయి దేశంలో ఉంటున్నా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తుంటామని దుబాయ్‌లో ఉంటున్న నిజామాబాద్ నివాసి అబ్దుల్ బాసిక్  తెలిపారు. ఇండియన్ ఫ్రెండ్ సర్కిల్ పేరుతో పదేళ్ల క్రితం దుబాయ్ ఓ సంస్థను స్థాపించామన్నారు. ఈ సంస్థ ద్వారా అక్కడ నివసిస్తున్న రాష్ర్ట ప్రజల సంక్షేమం కోసం ప లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రాజకీయ పరిణామాలపైనా చర్చిస్తుం టామన్నారు. ఓటు ప్రాముఖ్యం తెలుపుతుం టామన్నారు. అలాగే సౌదీలోని జెడ్డా నగరం లోని ఉర్దూ అకాడమీ జిద్దా ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికలపై జెడ్డాలో పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు ఉర్దూ అకా డమీ అధ్యక్షుడు గులాంసమ్దానీ తెలిపారు.
 
 ఇప్పటికే జెడ్డా, రియాద్, దుబాయ్ నుంచి దాదాపు 5000 మంది స్వదేశానికి వెళ్లడానికి తమ కంపెనీల్లో అనుమతి తీసుకున్నారని ఆయన తెలిపారు. అరబ్ దేశాల నుంచి వేల సంఖ్యలో రాష్ట్రానికి వచ్చి ఓటుహక్కు విని యోగించుకోవడం ఒక ఎత్తయితే, రావడానికి అవకాశం లేని వారు ఇక్కడి రాజకీయ పరి ణామాలపై ఓ అవగాహనకు వచ్చి ఏ పార్టీకి ఓటువేయాలో తమవారికి అక్కడి నుంచే సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో లక్షల్లో ఉన్న ‘గల్ఫ్’ఓట్లు ఆయా నియోజక వర్గాల్లోని అభ్యర్థుల తలరాతలు మారుస్తాయ నడంలో ఎలాంటి సందేహం లేదు.
 
 డిమాండ్లివీ...
 +    అప్పుల పాలై.. నిట్టనిలువునా మోసపోరుు... జైలుపాలై తిరిగొచ్చే వలస కార్మికులకు ప్రభుత్వం పునరావాస జీవనభృతి కల్పించాలి. స్వయం ఉపాధికి చేయుూత అందించాలి. ఉద్యోగ అవకా శాలు కల్పించాలి. అప్పులు.. ఆర్థిక సమ స్యల పరిష్కారానికి సాయుంగా నిలవాలి.
 +    గల్ఫ్ బాధితులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్  ఏర్పాటు చేసి రూ.రెండువేల కోట్ల నిధి కేటాయించాలి.
 +    విదేశాల్లో ఉన్న వారి సంక్షేమం కోసం వైఎస్ హయూంలో ఏర్పాటు చేసినట్లుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయూలి. ఏటేటా ఈ శాఖకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటారుుంచాలి.
 +    మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి. వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి. ఆహార, ఆరోగ్య భద్రత కల్పించాలి. అంత్యోదయ స్కీం కింద నెలకు 35 కిలోల బియ్యం అందించాలి.   భూమి లేని పేద వలస కార్మికులకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి.
 +    ఏజెంట్ వ్యవస్థను నియంత్రించి మోసాలు జరుగకుండా చూడాలి. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలుంటే... ప్రభుత్వ సంస్థల ద్వారానే భర్తీ అయ్యేలా చేయాలి,  
 +    గల్ఫ్ జైళ్లల్లో ఉన్న వారిని విడిపించి తీసుకురావాలి. ముఖ్యంగా సౌదీలోని నితాఖత్ చట్టబాధితులను రక్షించాలి. గల్ఫ్ దేశాల్లోని భారత రాయుబార కార్యాలయూల్లో తెలుగు భాష వచ్చిన అధికారులు ఉండేలా చర్యలు చేపట్టాలి.
 +    ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వలస జీవుల వుృతదేహాలను వున దేశానికి తీసుకురావడానకి 40 రోజులు పడుతోంది.  కాబట్టి వుృతదేహాల తరలింపునకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి.  
 +    విదేశాలలో ఉపాధి ఉందని వెల్లడించినప్పుడు.. రాను పోను  ఖర్చులు ఆ కంపెనీలే పెట్టుకోవాలనే అంశాన్ని అక్కడి ప్రభుత్వాలతో ద్వైపాక్షిక చర్చల ద్వారా తెలియజేయాలి.
 +    వలస కార్మికులు మరణించినప్పుడు, కారణాలను తెలియుజేయుటంతో పాటు అందాల్సిన వేతన బకారుులు, కనీస పరిహారం ఆ దేశం నుంచి ఇప్పించాలి.

Advertisement
Advertisement