ఖాకీవనంలో కష్టాలగానం | Sakshi
Sakshi News home page

ఖాకీవనంలో కష్టాలగానం

Published Sun, May 4 2014 4:49 AM

ఖాకీవనంలో కష్టాలగానం - Sakshi

ఈ ఏడాది నెలరోజుల తేడాతో 5 ఎన్నికలను పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వేళ సరిపడ సిబ్బంది లేకపోయినా సమస్యే. మన రాష్ట్రంలో ఈ దుస్థితి ఉంది. 1.29లక్షల మంది పోలీసులు ఉండాల్సి ఉంటే కేవలం 90,843మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో పోలీసులపై మరింత పనిభారం పడుతుంది. రాష్ట్రజనాభా 8,45,80,777. కానీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు కేవలం 90,843మంది మాత్రమే! దీనిని బట్టే శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది.

పోలీసులకు ప్రతీ ఎన్నికల్లో మూడురోజులు డ్యూటీ వేస్తారు. ఎన్నికలకు రెండురోజులు ముందు కేటాయించిన ప్రాంతానికి వెళ్లాలి. ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలకు సీమాంధ్ర నుంచి పోలీసులు 27న బయలుదేరారు.  28న తెలంగాణకు చేరుకున్నారు. తిరిగి 1వ తేదీ బయలుదేరి 2న ఇళ్లకు వచ్చారు. అంటే 5రోజులు డ్యూటీ ఉన్నట్లు. మన రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ఎన్నికల విధులకు కూడా మన పోలీసులు వెళ్లాల్సిందే!  

* పల్లెల్లో పోలీసులకు నివసించేందుకు గదులుండవు. మరుగుదొడ్ల సమస్యా ఉంది.
* ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసులు రాజకీయ నేతల ఇళ్లలో భోజనం చేయకూడదనే నిబంధన ఉంది. ఒక్కోసారి భోజనం దొరక్క పస్తులుండి డ్యూటీలు చేయాల్సి వస్తోంది.
* మహిళా పోలీసుల పరిస్థితి మరింత దయనీయం. రాత్రి వేళల్లో ఉండేందుకు సరైన బస లేక ఇబ్బందులు పడుతుంటారు.
* ఎన్నికల వేళ గ్రామంలో ఏ మూలన ఎలాంటి గొడవ జరిగినా పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. ఒక వేళ గొడవ పెద్దదైతే వారిపై చర్యలు ఉంటాయి.
* పల్లెల్లో గొడవలను నివారించే సమయంలో పోలీసులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడి ప్రాణం మీదకు తెచ్చుకున్న పోలీసులూ ఉన్నారు.
* స్థానిక సంస్థల్లో బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి.. కొందరు దుండగులు బాక్సుల్లో ఇంక్, నీళ్లు పోయడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తారు. ఇదే జరిగితే పోలీసులకు ఇబ్బందే.
* ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంకు తీసుకెళ్లడం కత్తిమీద సామే. ఇలా అడుగడుగునా గండాల నడుమ పోలీసులు విధులు నిర్వర్తించాలి. అయినా ఎవరూ వారి గురించి సానుభూతితో ఆలోచించరు.
 
తీవ్రమైన ఒత్తిడి
ఎన్నికలే కాదు.. దోపిడీలు, దొంగతనాలు.. ప్రమాదాలు, ప్రమోదాలు.. ధర్నాలు, దొమ్మీలు.. హత్యలు, అత్యాచారాలు.. బెట్టింగ్‌లు, వైట్‌కాలర్లు.. ఉరుసులు, ఊరేగింపులు.. విపత్తులు, వైపరీత్యాలు.. సందర్భం ఏదైనా పోలీసులుండాల్సిందే. 24 గంటలూ డ్యూటీలో లేదా రెడీగా ఉండాల్సిందే! దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే.. అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. అందుకే వారు నిరంతరం ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. వారికీ కుటుంబం ఉన్నా.. శ్రద్ధ తీసుకునే అవకాశముండదు. ఫలితంగా చాలామంది పోలీసుల పిల్లలు సరైన కెరీర్‌లో ఉండరు. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు పిల్లల పరీక్షలు జరిగాయి. కానీ పోలీసులు తమ పిల్లలు పరీక్షలు రాసే సమయంలో ఇంటి వద్ద ఉండి వారికి ధైర్యం చెప్పే అవకాశం లేకపోయింది.
 
 గౌరవం.. గుర్తింపూ ఉండదు
 ప్రజలకు సేవ చేయడమంటే పరమాత్మునికి సేవ చేయడమే. అందుకే పెద్దలు మానవ సేవే మాధవ సేవ అన్నారు. ప్రజాసేవలో ఉండే వారి నుంచి నీతి, నిజాయితీ, అంకితభావం, మానవత్వం, కాస్తంత త్యాగం వంటి లక్షణాలను సమాజం ఆశిస్తుంది. ఎంత చేశామన్నది కాదు, ఎలా చేశామన్నది ముఖ్యమని సమాజం అంటుంది. ఇరవై నాలుగ్గంటలూ ప్రజల మధ్య ఉండి వారిని కనిపెట్టుకునే పోలీసు నుంచి కూడా ఇటువంటి విలువలనే సమాజం కోరుకుంటుంది. అయితే పోలీసుల చిన్న చిన్న తప్పులను అందరూ పరిగణలోకి తీసుకుంటారు. కానీ నాటి చైనా యుద్ధం నుంచి నేటి అంతర్గత భద్రత వరకు సాయుధ సంఘర్షణలో ప్రతి నిత్యం చావుబతుకుల మధ్య పోరాటం సాగిస్తున్న వారి త్యాగాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. పోలీసులందరూ అవినీతిపరులూ కాదు. అందరూ నీతిమంతులూ కాదు. సమాజంలోని అన్ని వర్గాల్లో, అన్నిశాఖల్లో ఉన్నట్లు పోలీసు శాఖలో కూడా కలుపుమొక్కలుంటాయి. అయితే మనకవి మహావృక్షాలుగా గోచరిస్తాయి.
 
మహిళా సిబ్బందీ.. కొరతే
విధుల్లో మహిళా ఉద్యోగులు మరింత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఏఆర్ విభాగాల్లో 4,646 మంది మహిళా పోలీసులు ఉండాలి. ప్రస్తుతం 1,975 మంది మాత్రమే ఉన్నారు.

 ప్రత్యేక పీఆర్సీ ఇవ్వాలి
అందరు ఉద్యోగుల్లా మేము ఆందోళనకు దిగలేం. మాకు ప్రత్యేకంగా వేతన సవరణ చేయాలి. ప్రమోషన్లు వేగవంతం చేయాలి. పోలీస్‌స్టేషన్ల సంఖ్యను పెంచాలి. పని విభజన జరగాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అవసరానికి తగ్గట్టుగా కొత్త పోస్టులు మంజూరు చేయాలి. ఇంకా మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలి.    - అగ్రహారం శ్రీనివాసశర్మ, పోలీసు సంఘం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు.
 
 వైఎస్ హయాంలో పోలీసుల సంక్షేమం
 పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ద చూపించారు. పోలీసు కాలనీలకు కళ్యాణమంటపాలు, మినరల్‌వాటర్ ప్లాంట్లు.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు తదితర విషయాల్లో ప్రత్యేక చొరవ చూపారు. సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేందుకు 31శాతం ఖాళీలను భర్తీ చేశారు. కొత్తగా పోస్టులను మంజూరు చేశారు. తత్ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు సాధించారు.


* ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేశారు.
* లూప్‌లైన్‌లో పనిచేసే పోలీసులకు 30 శాతం ఇంక్రిమెంట్లు వేస్తామని 2009లో చెప్పారు.
* రాష్ట్రంలోని పోలీసులందరికీ ఇళ్లపట్టాలు ఇస్తామని మాట ఇచ్చారు. కొన్ని చోట్ల ఇచ్చారు కూడా.
* పత్యేకంగా వేతన సవరణ చేయాలని భావించారు.
* డీటీసీ, పీటీసీలను బలోపేతం చేయాలనుకున్నారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఇవన్నీ ఆచరణకు నోచుకోలేదు.
 
 హోం‘గార్డు’కు రక్షణ ఇవ్వని బాబు
  హోంగార్డు.. పోలీసు శాఖకు రక్షకుడి లాంటి వాడు. చూసేవాళ్లకు పోలీసు శాఖలో ఉద్యోగమే అరుునా వేతనం వూత్రం అరకొరే. వురీ వుుఖ్యంగా చంద్రబాబు పాలనా కాలంలో వారి పరిస్థితి దయునీయుంగా ఉండేది. అప్పటి ప్రభుత్వం కూలీల కంటే హీనంగా చూసింది.

 రోజు వేతనం రూ.75లే
 భవన నిర్మాణ, ఇతర రంగాల్లోని కూలీలకు రోజు వారీ కూలి రూ.100కు పైగా ఉండగా... అప్పట్లో హోంగార్డులకు చంద్రబాబు సర్కారు ఇచ్చింది రోజుకు రూ.75లే. సెలవులు, వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేదు. గైర్హాజరు కాకుండా నెలంతా పని చేస్తే రూ.2,250 వచ్చేది. ఈ వేతనం ఏవూత్రవుూ చాలక హోంగార్డుల కుటుంబాలకు పస్తులు తప్పేవికావు. నోరెత్తితే ఉద్యోగాలు ఊడగొట్టేవారు. ముష్టిలా ఇచ్చే వేతనం కూడా మూడు.. నాలుగు నెలలకోసారి చేతికొచ్చేది.

టీడీపీ నేత ఒత్తిళ్లతో..
 ఈ ఫొటోలోని వ్యక్తిపేరు సురేష్. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు వాసి. 2013బ్యాచ్‌కు చెందిన  ఆయన ఇటీవలే వైఎస్సార్‌జిల్లా ఓబుళవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వివాహమైంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండే సురేష్‌ది సున్నిత మన స్తత్వం. ఏప్రిల్ 6న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కొందరికి అనుకూలంగా పనిచేయాలని అన్నిస్థాయిల్లో ఒత్తిడి వచ్చింది. మనస్సాక్షిని చంపుకోలేక సురేష్ చివరకు అదే నెల 7వ తేదీన పోలీసు క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. సురేష్ మృతికి ఓ టీడీపీ నేత ప్రధాన కారణమని పోలీసు వర్గాలు బాహాటం గానే ఆరోపి స్తున్నాయి. ఇలా ఒత్తిళ్లు తాళలేక విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయినవారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. సురేష్ మృతిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇంతటితో సురేశ్ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? అనే ప్రశ్నకు ప్రభుత్వాలు, నాయకులు సమాధానం చెప్పాలి.

వయో పరిమితిని కుదించిన ఘనుడు
కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల్లో వంద పోస్టులకు గాను పది చొప్పున హోంగార్డులకు ఇవ్వాలని రిజర్వేషన్ ఉంది. నియమితులై రెండేళ్లు పూర్తవడంతో పాటు ఆ కాలంలో కనీసం 180 రోజులు విధులు నిర్వర్తించిన వారికే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 1995 కంటే ముందు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే హోంగార్డుల వయోపరిమితి 35 ఏళ్ల వరకు ఉండేది. దీన్ని చంద్రబాబు 30 ఏళ్లకే కుదించారు. తద్వారా వేలాది మంది హోంగార్డుల పొట్టకొట్టారు.
 
సేవలను గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి
 హోంగార్డుల సేవలను  వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించి... వారి సంక్షేమానికి కృషి చేశారు. వేతనాన్ని రూ.2,250 నుంచి రూ.6 వేలకు పెంచారు. వారి పిల్లల ఉన్నత చదువు కోసం ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను వర్తింపజేశారు. వేతనం ప్రతినెలా సక్రవుంగా అందేలా చూశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని తిరిగి 35 ఏళ్లకు పెంచారు. దీంతో వేలాది మందికి లబ్ధి చేకూరింది. వైఎస్ హయూంలో రాష్ట్రంలో హోంగార్డుల నియూవుకాలు కూడా భారీఎత్తున చేపట్టారు. చంద్రబాబు హయూంలో 20 వేల లోపే ఉండగా.. వైఎస్ ఆ పోస్టుల సంఖ్యను 40 వేలకు పెంచి నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. వీరిలోనూ 12వేల మందికి పైగా మహిళా హోంగార్డులు ఉండటం గవునార్హం.
 
 పోలీస్ లీడర్ రావాలి

 పోలీసు శాఖలో చాలా పోస్టుల భర్తీకి వుుఖ్యవుంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోలీసు శాఖ బలంగా ఉండాలని కోరుకునేవారు. పోలీసు అకాడమీని రక్షించిన నాయుకుడు వైఎస్. పైగా, కొంత భూమి నష్టపోరుునందుకు పోలీస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి ఏ మేరకు పరిహారం ఎంతకావాలో కూడా ఇస్తావుని చెప్పారు.

 ధైర్యమిచ్చే పోలీస్ బాస్ కావాలి
 రాజకీయు ఒత్తిళ్లు. అండగా నిలవాల్సిన పోలీసుల్లో వునకెందుకనే నిరుత్సాహ ధోరణి. వీటి వుధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఏ సవుస్య ఎదురైనా అనునిత్యం యుుద్ధమే. ఇప్పుడున్న పోలీసు విధానం వూరాలంటే గతంలో వూదిరిగా సవుర్ధుడైన పోలీస్ బాస్‌లు ఉండాలి. అప్పుడే కింది స్థారుులో పోలీసులకు వునోధైర్యం ఉంటుంది. జనానికి కూడా పోలీసుల దగ్గరకు వెళితే సవుస్య పరిష్కారం అవుతుందనే ధీవూ ఏర్పడుతుంది. పోలీస్ బాస్ అంటే ఒక్క డీజీపీనే కాదు. జిల్లా స్థారుులో ఎస్పీ వరకు పోలీస్ బాసే అవుతారు. కింది స్థారుులో ఎవరైనా తప్పు చేస్తే పిలిచి హెచ్చరించి బాగా పనిచేసేలా చేయూలి.

Advertisement
Advertisement