గీత స్మరణం | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Sep 12 2013 12:07 AM

గీత స్మరణం

పల్లవి :
 
 ఆమె: అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలనీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 అతడు: నింగి నేల
   నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...
 అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలననీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 
 చరణం : 1


 అ: నిదురలోని కల చూసి
   తుళ్లి పడిన ఎదకి
 ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై
 ఆ కలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై
 ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 
 నను వీడొద్దే అమ్మా..
 బంగారం నువ్వమ్మా...
 
 చరణం : 1
 
 అ: చిన్ని చిన్ని తగవులే
   మాకు లోకమైన వేళ
 నీ వెతలు మనసెపుడైన
   పోల్చుకున్నదా
 రెప్పలా కాచిన నీకు
  కంటి నలుసులాగ
 వేదనలు పంచిన మాకు
 వేకువున్నదా
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...
 
 చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
 రచన : వనమాలి
 సంగీతం : మిక్కీజె. మేయర్
 గానం : శశికిరణ్, శ్రావణభార్గవి

 

Advertisement
 
Advertisement
 
Advertisement