భలే కాన్సెప్ట్‌! | Sakshi
Sakshi News home page

భలే కాన్సెప్ట్‌!

Published Mon, May 7 2018 12:51 AM

'Bharath' will be released next year Ramzan - Sakshi

అమెరికన్‌ క్వాంటికో సెకండ్‌ అండ్‌ థర్డ్‌ సిరీస్‌లో అలెక్స్‌గా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్‌ స్టార్‌డమ్‌ మరింత పెరిగింది. గతేడాది డ్వేన్‌ జాన్సన్‌ హీరోగా రూపొందిన ‘బేవాచ్‌’ చిత్రంతో ప్రియాంక హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాధించకపోయినప్పటికీ ప్రియాంక నటనకు మాత్రం హాలీవుడ్‌ ఫిదా అయిపోయింది. అందుకే ఆమెకు హాలీవుడ్‌ చాన్స్‌లు వెతుక్కుంటూ వచ్చాయి.

తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌తో కలిసి నటించనున్నారు ప్రియాంక. అయితే... ఇది సినిమా కాదు. ‘ఇఫ్‌ ఐ కుడ్‌ టెల్‌ యు జస్ట్‌ వన్‌ థింగ్‌’ అనే యూట్యూబ్‌ సిరీస్‌లో! ప్రపంచంలో ఎలాంటి ఆలోచనలతో మంచి మార్పు వస్తుంది? అనే విషయాన్ని గొప్ప స్థాయిల్లో ఉన్నవారు, ఇన్‌స్పైరింగ్‌ పర్సన్స్‌ ఈ ప్రొగ్రామ్‌లో పంచుకుంటారట. కాన్సెప్ట్‌ భలేగా ఉంది కదండీ. ప్రస్తుతం ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్, ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో ప్రియాంక నటిస్తున్నారు.

ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రియాంకా ‘భరత్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘జై గంగాజల్‌’ ప్రియాంక నటించిన చివరి హిందీ చిత్రం. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందుతున్న ‘భరత్‌’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది.

Advertisement
Advertisement