మిద్దె తోటలో మొక్కజొన్న

12 Feb, 2019 04:48 IST|Sakshi

ఇంటి పంట

మిద్దె తోటల్లో కూడా మొక్కజొన్నను అన్ని కాలాల్లోనూ బాగా పండించుకోవచ్చు. పెద్దగా తెగుళ్లు రావు. నాటిన రెండు నెలలకు, పొత్తులు తయారవుతాయి. మరో నెల దాకా అవసరాలకు పనికివస్తాయి. ఉదయాన్నే ఒకటో రెండో మొక్కజొన్న పొత్తులు తినండి. ఉప్పూ నూనెల తిండ్లకు దూరంగా ఉండండి. ఒక మొక్కజొన్న పొత్తు తింటే, మరే టిఫిన్‌ అవసరం లేదు. ఆకలి అవదు. మలబద్ధకం ఉండదు. అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. పాలిష్‌ చేసిన తెల్ల అన్నం తినటం కంటే, మొక్కజొన్న పొత్తును తినడం నయం. పొత్తుల్ని కాల్చుకొని తినడం కంటే, లైట్‌గా ఉడికించి తినడం మంచిది. 

అడుగు(ఫీటు) లోతు మట్టి ఉంటే చాలు, మొక్కజొన్నను పెంచుకోవచ్చు. ఎటు చూపినా పది అంగుళాలకు ఒక విత్తనాన్ని నాటుకోవాలి. అర అంగుళం లోతులో విత్తనాలను నాటుకోవాలి. నాటాకా మడి మొత్తం తడిసేలా నీరు పెట్టాలి. మట్టి నాలుగైదు వంతులు, ఎరువు ఒక వంతు చొప్పున కలిపి వాడాలి–  మడుల్లో. ఆహార వైవిధ్యం పాటించాలి. మనం ఆరోగ్యంగా జీవించాలి. 
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా