Sakshi News home page

ఇక బెంగాలీలో...

Published Sun, Jun 28 2015 4:25 AM

ఇక బెంగాలీలో... - Sakshi

గాసిప్
మామూలుగానైతే ప్రాంతీయ చిత్రాలలో కంటే బాలీవుడ్ కమర్షియల్ సినిమాలలో నటించడానికే హీరోయిన్లు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. అయితే బెంగాలీ చిత్రాల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. బాలీవుడ్‌లో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, బెంగాలి చిత్రాలలో నటించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.
 
గతంలో ఐశ్వర్యరాయ్, బిపాషా బసు, మనిషా కొయిరాలా, దియా మిర్జా... మొదలైన అందాల తారలు బెంగాలి చిత్రాలలో కనిపించారు. డీగ్లామరస్‌గా కనిపించే పాత్రలకు సైతం కొందరు హీరోయిన్లు ఒప్పుకున్నారు.
 
‘‘బెంగాలి చిత్రాలలో నటించడం అంటే...నటనకు సంబంధించి రెండు విషయాలు ఎక్కువ తెలుసుకోవడం’’ అని అంటారు ఐశ్వర్యరాయ్. ‘‘గొప్ప పాత్రలలో నటించడానికి, నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి బెంగాలి చిత్రాలలో నటించాలి’’ అంటారు మనీషా.
 
బెంగాలీ డెరైక్టర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే, నటనలో పరిణతి సాధించినట్లే అనే భావన కూడా ఉంది. ఇప్పుడు ఆ అదృష్టం దీపిక పడుకునే తలుపు తట్టనుంది. ‘పికు’ చిత్రంలో దీపిక నటన ప్రసిద్ధ బెంగాలీ దర్శకులను ఆకట్టుకుందట. ఆ సినిమాలో దీపిక బెంగాలి ఆర్కిటెక్ట్‌గా నటించింది. దీపికా  ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్‌లు వినడం మొదలుపెట్టిందట.

Advertisement

What’s your opinion

Advertisement