దేవుడు మీముందుంటే... ఆశీర్వాదాలు మీ వెంటే | Sakshi
Sakshi News home page

దేవుడు మీముందుంటే... ఆశీర్వాదాలు మీ వెంటే

Published Sun, Jan 7 2018 1:15 AM

devotiomnal information by prabhu kiran - Sakshi

క్రైస్తవమంతా దేవుడు వాడుకున్న, దేవునికి, ఆయన సంకల్పాలకు విశ్వాసంతో తలవంచి విధేయత చూపిన ఒక వ్యక్తి ‘అబ్రాహాము’తో ఆరంభమైంది. మానవాళితో సహా విశ్వాన్నంతా సృష్టించి, దానంతటికీ యజమాని అయిన దేవుణ్ణి మానవాళి సృష్టి, ఆరంభంలోనే కొన్ని తరాల తర్వాతే పక్కన పెట్టి ఆరాధనల పేరిట నరబులుల, దుర్బలుల శ్రమదోపిడి, దేవాలయాల్లోనే శృంగారం, మితిమించిన విగ్రహారాధన వంటి దుష్ట సంప్రదాయాలను అనుసరిస్తున్న నేపథ్యంలో, దేవుడు అబ్రాహాము ద్వారా తన మార్గనిర్దేశనం చేశాడు.

మధ్య ప్రాచ్య ప్రాంతమైన మెసొపొటేమియా (ఇప్పటి ఇరాన్, ఇరాక్‌ ప్రాంతం)లో ఉన్న అబ్రాహామును ‘నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్లు’అని ఆదేశించాడు. ‘ఏదేశానికి? అదెలా ఉంటుంది?’ అన్న ఎదురు ప్రశ్న వేయకుండా అప్పటికప్పుడు దైవాజ్ఞ పాలనకు అబ్రాహాము నడుము కట్టి బయలుదేరాడు. లోకాన్ని ప్రశ్నించడం అనేది మనిషి నైజంలో ఉంది. అయితే లోకాన్ని ప్రశ్నించడం హేతువాదమనిపిస్తుంది. దేవుణ్ణి ప్రశ్నించకపోవడమే నిజమైన విశ్వాసమనిపిస్తుంది.

‘నీవు వెళ్లు’ అన్న దైవాజ్ఞ పాలన వెనుక అబ్రాహాముకు ఆ దేవుని శక్తి సామర్థ్యాలు, ప్రేమాపూర్ణత పట్ల అవగాహన ఉంది. ఆ అవగాహనలో నుండే అతని విశ్వాసం పుట్టింది. ప్రశ్నించడం హేతుబద్ధమే కాని అది అవిశ్వాసం!! తల వంచి దేవునికి అవిధేయులం కావడం వల్ల లోకం సృష్టిలో మనం బలహీనులం కావచ్చు. కాని అదే ఆశీర్వాదాలకు ఆరంభం!! అందుకే తన పట్ల మానవాళి భక్తిశ్రద్ధలకు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని ప్రామాణికం చేశాడు. కొత్త ఏడాది ముంగిట్లో నిలబడ్డ మనతో కూడా నీవు వెళ్లు అంటున్నాడు దేవుడు. రాబోయే 365 రోజుల కాలఖండంలో మనకేమేమి అనుభవాలు ఎదురుకానున్నాయో మనకు తెలియదు.

కాని ‘నీవు నేను చూపించే దేశానికి వెళ్లు’ అని దేవుడాదేశిస్తే విధేయుడై Ðð ళ్లిన అబ్రాహాము పాలు తేనెలు ప్రవహించే కనానులో కాలు పెట్టినట్టే, మీరూహించని ఆశీర్వాదాలు, ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాలు చలిచూడనున్న మరో ఏడాదిలోకి మీరు కాలుపెట్టబోతున్నారు. ఎందుకంటే ‘నీవు వెళ్లు’ అని ఆదేశించిన దేవుడే అబ్రాహాముకు ముందుగా నడిచినట్టే, మీరు కాలు పెట్టకమునుపే ‘కొత్త ఏడాది’లో ఉన్న దేవుడు మీతోపాటు ఉంటాడు.

కనానులో అబ్రహాము కరువునెదుర్కొన్నాడు. కాని అలా జరిగిన ప్రతిసారీ ఆయన విశ్వాసంలో స్థిరపడ్డాడు. రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడిప్పుడే మనం కాలుపెట్టిన కొత్త ఏడాదిలోనూ కొన్ని చేదు అనుభవాల్లో కూడా అసాధారణమైన దైవకృపను, ఆయన సాన్నిధ్యాన్ని మీరనుభవిస్తారు. దేవుడున్న చోట లోకసంబంధమైన భయమనేది ఉండదు. అందువల్ల ‘మీకు దేవుడు ముందుం టే, విజయాలు, ఆశీర్వాదాలు మీ వెంటే!

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement