లంఖణం పరమౌషధమే!

21 Jan, 2019 00:34 IST|Sakshi

ఉపవాసం అద్భుతమైన ఔషధమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. సైన్స్‌ కూడా దాన్ని ధ్రువీకరించింది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమేమిటో స్పష్టం చేస్తోంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల మన కాలేయం,  అస్థిపంజర కండరాలపై ప్రభావం పడుతుందని ఇది కాస్తా జీవక్రియల ప్రక్రియను దృఢపరుస్తుందని అంటున్నారు పాలో సాసోన్‌ కోర్సీ అనే శాస్త్రవేత్త. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు.

మారిపోయే శరీర వాతావరణానికి తగినట్టుగా శరీరంలోని గడియారం కొన్ని మార్పులు చేసుకుంటూ శరీర స్థితిని కాపాడుతూ ఉంటుందని.. ఆహారం ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు కోర్సీ. నిరాహారం వల్ల ఇందుకు సంబంధించిన జన్యువులు చైతన్యవంతం అవుతున్నాయని అస్థిపంజర కండరాలు వీటిల్లో ఒకటని చెప్పారు. ఎలుకలకు 24 గంటలపాటు ఆహారం ఇవ్వకుండా తాము ఒక ప్రయోగం చేశామని ఈ సమయంలో శరీరం మొత్తమ్మీద ఆక్సిజన్‌ వినియోగం తక్కువైపోగా.. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ తేడాలు వచ్చాయని ఆహారం తీసుకోగానే పరిస్థితి మొదటికి వచ్చిందని కోర్సీ తెలిపారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు