Sakshi News home page

నూనె ఎలా పెడుతున్నారు?!

Published Mon, Jun 6 2016 11:27 PM

నూనె ఎలా పెడుతున్నారు?!

బ్యూటిప్స్
తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే....
1.    కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి.
2.    రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి.
3.    ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి.
4.    పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి.
5.    కనీసం 30 నిమిషాలు వదిలేయాలి.
6.    షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి.
7.    జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి.
తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు.

Advertisement

What’s your opinion

Advertisement