నన్నడగొద్దు ప్లీజ్‌ | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Tue, Apr 4 2017 12:01 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

నా పేరు రాకేష్‌.. నా వయస్సు 22. రెండు సంవత్సరాల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించా. తను ఓకే చెప్పడంతో సెటిల్‌ అయిన తరువాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసింది, ఒప్పించేందుకు ప్రయత్నించాం... కానీ, వాళ్ల బాబాయ్, మామ కలిసి తప్పుడు కేసులో ఇరికించి పోలీసులకు లంచం ఇచ్చి కొట్టించారు. తరువాత పోలీసులు నా దగ్గర కూడా మనీ తీసుకుని వదిలేశారు. మళ్ళీ ఆ అమ్మాయి ‘ఒకసారి మా వాళ్లతో మాట్లాడమంది’. మళ్ళీ మాట్లాడా. నో యూజ్‌. ఒక సారి లెటర్‌ రాసింది. ‘నువ్వు వరసకు బ్రదర్‌ అవుతావు అంది’ ఎలా? అని అడిగా.

మా నాన్నమ్మ, వాళ్ల నాన్నమ్మ పుట్టింటి పేర్లు ఒకటే అంటా. నిజానికి మా నాన్నమ్మకు, వాళ్ల నాన్నమ్మకు ఏ సంబంధం లేదు. కానీ తనకు ఏదో చెప్పి మనస్సు మార్చేశారు. ఇప్పుడు నేను ఎదురుపడితే పట్టించుకోవడం లేదు. వాళ్ల మామతో పెళ్లికి సిద్ధమయిపోయింది. నేను మాత్రం చాలా డిస్టర్బ్‌ అయ్యాను. ఎంత పట్టించుకోకపోయినా... రాత్రుళ్లు నిద్ర రావట్లేదు. ఫ్లీజ్‌ సలహా ఇవ్వండి.
– రాకేష్‌

ఒకటి... రెండు... మూడు.... నాలుగు... ఐదు... ఆరు... ఒక వందా ముఫై ఎనిమిది... ఒక వందా ముఫై తొమ్మిది.... ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు...’‘ఏంటి నీలాంబరీ... లెక్కల పరీక్ష ఏమయినా రాస్తున్నావా.. ముందే నువ్వు మాథ్స్‌లో కొంచెం వీకు.. అలాంటి ప్రయత్నాలు ఏమయినా చేసి ఫెయిల్‌ అయితే, లవ్‌ ఫెయిల్యూర్‌ కేసుల్లా నీకు మాథ్స్‌ ఫెయిల్యూర్‌ కౌన్సిలింగ్‌ చేయ్యాల్సొస్తుంది. వద్దు, ఫ్లీజ్‌.. వద్దే వద్దు అలాంటి సాహసాలు చేసి, నా మెడకు కొత్త ప్రాబ్లమ్‌ క్రియేట్‌ చెయ్యొద్దు.. నీకు శీర్షాసనం చేసి మరీ మోరపెట్టుకుంటా..’దబుక్కున చున్నీ నడుముకి బిగించి, తల కింద కాళ్లు పైన పెట్టి కొత్త ఫోజు వేసింది.. ‘ఒకటి...రెండు...మూడు....నాలుగు...ఐదు...ఆరు.... ఒక వందా ముఫై ఎనిమిది.... ఒక వందా ముఫై తొమ్మిది.... ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు...’ ‘వాట్‌ ఈజ్‌ దిస్‌ తల కిందల తపస్సు..’ అని నేను శీర్షాసనం వేసి ముఖంలో ముఖం పెట్టి అడిగా.. ‘నిద్ర రావాలంటే కౌంటింగ్‌ చెయ్యమని పుస్తకంలో చదివా..’ మై డియర్‌ డాక్టర్‌ అందుకే ట్రై చేస్తున్నా... మరి హెడ్‌ డౌన్‌... లెగ్స్‌ అప్‌ దేనికి..?కౌంటింగ్‌ వర్కౌట్‌ కాకపోతే, రివర్స్‌ స్టాండింగ్‌తో నిద్ర పట్టుద్దేమో అని!’

రాకేష్‌... నా మాట విని, నీలాంబరి దగ్గర ఉన్న కమిట్మెంట్‌లో కొంచెం నువ్వు కూడా పూసుకో.. లాఠీతో బేఠీలు, పోలీస్‌ గొడవలు.. లవర్‌–సిస్టర్‌ కన్ఫ్యూజన్లు... గర్ల్‌ఫ్రెండ్‌–మేనమామ మ్యారేజ్‌లు.. లాంటి ప్రాబ్లమ్స్‌తో నిద్ర పట్టకపోతే ‘డు వాట్‌ నీలూ డజ్‌’. ‘‘మాథ్స్‌ వస్తుంది.. నిద్ర వస్తుంది...’’ ప్రేమలో తలకిందుల అయినా ప్రపంచం, శీర్షాసనంతో మళ్ళీ స్ట్రైట్‌గా కనబడుతుంది. ఏమంటావు? ‘ అందరికీ నా అంత కమిట్మెంట్‌ ఉండదు డియర్‌ డాక్‌.. ఇంకోమాట చెప్పండి శీర్షాశనం వేస్తూ అరటిపండు తినొచ్చు’ అంది నీలాంబరి. ‘అరే.. ఫర్గెట్‌ ఫర్గివ్‌ అండ్‌ మూవ్‌ పార్వర్డ్‌ బ్రో’....
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement