Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published Wed, Apr 11 2018 12:21 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. చెప్పాలంటే మాటలు సరిపోవు, అంతగా ఆరాధించాను. కానీ తను నాతో చాట్‌ చేసినట్లే ఇంకొకడితోనూ చాట్‌ చేసిందని, నాతో మాట్లాడినట్లే ఇంకొకడితోనూ మాట్లాడిందని తెలిసి తట్టుకోలేక గుడ్‌ బై చెప్పేశాను. బట్‌ ఇప్పుడు తన జ్ఞాపకాలు నన్ను చాలా వేధిస్తున్నాయి. చాలా చాలా బాధగా ఉంది. తనని ఎలా మరిచిపోవాలో చెప్పండి అన్నయ్యా ప్లీజ్‌!? – అజయ్‌
బాధ చాలా రుచిగా ఉంటుంది అజయ్‌!‘ఇవాళ మీరు బాధనే తినండి సార్‌. నో అరటిపండు ఫర్‌ యు సార్‌!’నిజం నీలాంబరి.. బాధను ఎంజాయ్‌ చెయ్యాలి.‘అప్పుడు మీకు ఉత్తరం రాయడమెందుకు సార్‌? ఎవరి బాధను వాళ్లు నములుకుంటూ నవ్వుతూ బతకొచ్చు కదా??? ఇలాంటి విపరీతమైన ఐడియాలు లవర్స్‌కు ఇచ్చి... మీ బిజినెస్‌ కాళ్ల మీద గొడ్డలితో కొట్టుకోవడంలో మిమ్మల్ని మించిన గ్రేట్‌ పర్సన్‌ఇంకొకరు ఉండరు సార్‌. ఎందుకు సార్‌ మీకు మీ నీలాంబరి మీద.. మీ క్లినిక్‌ మీద.. చివరికి మీ అరటిపండు మీద అంత కక్ష?’భలే చెప్పావు నీలాంబరీ.. బాధను నములుతూ, నవ్వుతూ బతకమని..! అసలు ఎంత రిథమ్‌లో చెప్పావు నీలూ. యు ఆర్‌ గ్రేట్‌!‘అజయ్‌..! ఇవాళ లవ్‌డాక్టర్‌ ఇంకో ఫ్లోలో ఉన్నారు. ఆ ఫ్లోలో నాకర్థమైంది నీకు చెబుతా. ప్రేమ ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. ఎడబాటు కూడా అంతే ఎమోషనల్‌గా ఉంటుంది. కుమిలిపోకుండా ఆ బాధను కూడా ప్రేమించగల్గితే లైఫ్‌ బాగుంటుంది అని ఆయన తొక్కలో సలహా!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

What’s your opinion

Advertisement