కళ్లు నులుముకుంటే గొంతుకు ఇన్‌ఫెక్షన్! | Sakshi
Sakshi News home page

కళ్లు నులుముకుంటే గొంతుకు ఇన్‌ఫెక్షన్!

Published Mon, Jun 23 2014 11:49 PM

కళ్లు నులుముకుంటే గొంతుకు ఇన్‌ఫెక్షన్!

నివారణ
 
అవును... మురికి చేత్తో కళ్లను నులుముకుంటే... క్రిములు కన్నీటి నాళాల నుంచి గొంతుకు చేరి శ్వాస సంబంధమైన అంటువ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి తరచు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అన్ని రకాలుగా ఆరోగ్యకరం.
 
శ్వాసకోశ సంబంధమైన అనేక అంటువ్యాధులు చాలా చిన్న కారణాలతోనే వస్తుంటాయి. వాటిని నివారించాలంటే...
 
ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ప్రయాణాలలో తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈత కొలనులో ఈత కొట్టే ముందు ఆ నీటిని క్లోరినేట్ చేశారా, లేదా అని తెలుసుకోవాలి. క్లోరినేట్ చేసినట్లు నిర్ధారించుకున్న తర్వాతనే నీటిలోకి దిగాలి.
 
నీటిని కానీ, ఇతర పానీయాలను కానీ మరీ చల్లగా తాగకూడదు.
 
సమతుల ఆహారం తీసుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి.
 
వంట చేయడానికి, తినడానికి, మందులు వేసుకోవడానికి కూడా చేతులు శుభ్రంగా ఉండాలి.
 
ధూమపానం చేయరాదు. ప్యాసివ్ స్మోకింగ్ (స్వయంగా పొగ తాగక పోయినా, ధూమపానం చేస్తున్న వారు విడుదల చేసే పొగను పీల్చడం) కూడా హానికారకమే.
 

Advertisement
Advertisement