ఊడ్చేస్తే అవమానించినట్లే! | Sakshi
Sakshi News home page

ఊడ్చేస్తే అవమానించినట్లే!

Published Sat, Nov 9 2013 12:17 AM

ఊడ్చేస్తే అవమానించినట్లే!

 ఏ ప్రాంతం వారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారో మనకు కొంత తెలుసు. అయితే ఏ ప్రాంతంలో ఎలా తినాలో తెలుసా? తిండిలోనే కాదు, తినడంలో కూడా ఒక్కో ప్రాంతానిదీ ఒక్కో శైలి.  వాటి గురించి తెలుసుకోవడం అందరికీ అవసరమే. ఎందుకంటే... ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి శైలిని ఫాలో అవ్వకపోతే, వారు మనల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది.
     
 పోర్చుగల్లో భోజనం చేసేటప్పుడు... ఆహారంలో ఉప్పు కానీ, మిరియాల పొడి కానీ తక్కువైనా మాట్లాడకూడదు. తీసుకురమ్మని అడగకూడదు. అలా చేస్తే, అది వండిన వారిని అనుమానించినట్టు లెక్క!
     
 ైచె నా వారి ఆచారం ప్రచారం... తినడం పూర్తయ్యాక కంచంలో కాస్తయినా ఆహారాన్ని వదిలిపెట్టాలి. మొత్తం ఊడ్చేస్తే... సరిపడనంత ఆహారం పెట్టలేదని అవతలివాళ్లను అవమానించినట్టు లెక్క!
     
 చిలీ, బ్రెజిల్ దేశాలో ఎటువంటి ఆహార పదార్థాన్నయినా సరే... చెంచాలు, ఫోర్కులతోనే తినాలి. తినేదాన్ని చేతితో ముడితే మనకు మ్యానర్స్ లేదనుకుంటాను. చివరికి బర్గర్‌ను కూడా స్పూన్‌తో తినాల్సిందే!
     
 థాయ్‌లాండ్‌లో ఫోర్కుతో ఆహారాన్ని నోటిలో పెట్టుకోకూడదు. కేవలం స్పూన్‌తోనే పెట్టుకోవాలి. అలాగే అక్కడ టూత్‌పిక్స్ కూడా వాడకూడదు!
     
 భోజనానికి పిలిచినప్పుడు పసుపురంగు పూలు తీసుకెళ్లినా, వాళ్లను భోజనానికి పిలిచినప్పుడు ఏ డైనింగ్ టేబుల్‌మీదో పసుపురంగు పూలను పెట్టినా... చైనీయులకు చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే... అక్కడ పసుపురంగు అయిష్టతకు చిహ్నం!
     
 పెట్టిన ఆహారాన్ని సూపర్‌గా ఉందంటూ పొగడటం ఫ్రాన్స్‌వారికి అస్సలు నచ్చదట!
     
 భోజనం చేసిన వెంటనే గట్టిగా తేన్చడాన్ని కొన్ని ఆసియా దేశాల వారు ప్రశంసగా తీసుకుంటారు!
     
 ఆఫ్ఘనిస్తాన్‌లో ఆహారాన్ని ఎంతో గౌరవిస్తారు. తినేటప్పుడు ఏ రొట్టెముక్కో జారి పడితే... దాన్ని తీసి, ముద్దుపెట్టుకుని అప్పుడు తినాలి!
     
 ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే... భోజనం అవగానే లేచి వెళ్లిపోవడాన్ని మెక్సికోలో అమర్యాదగా పరిగణిస్తారు!
     
 తిన్న తరువాత గిన్నెలు కడిగి, టేబుల్ సర్దేస్తే... మనల్ని మర్యాదస్తులుగా గుర్తిస్తారు ఫిలిప్పీన్స్ వారు!
 

Advertisement
Advertisement