Sakshi News home page

సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకుంటున్నారా?

Published Wed, Oct 4 2017 11:54 PM

Remember social responsibility?

మనదేశంలో సివిక్‌సెన్స్‌ పట్ల ధ్యాస చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే క్లీన్‌ అండ్‌ గ్రీన్, స్వచ్‌ భారత్‌ క్యాంపెయిన్‌ల అవసరం వచ్చింది. ప్రభుత్వం పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా పాటించే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. రకరకాల సామాజిక నేపథ్యాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లైనా నాగరక ప్రపంచంలో కనీస సామాజిక జ్ఞానం లేకుండా వ్యవహరించరాదు. మీ ధోరణి ఎలా ఉంటోంది? ఓసారి చెక్‌ చేసుకోండి!

1.    సివిక్‌ సెన్స్‌ను పాటించడం అంటే సమాజంలో ఒక వ్యక్తిగా మీరు పాటించాల్సిన సామాజిక విలువలను గౌరవించడం అని మీ అభిప్రాయం.
    ఎ. అవును   బి. కాదు

2.    రోడ్ల మీద ఉమ్మడం వంటి సామాజిక జ్ఞానం లేని ప్రవర్తనను ఇష్టపడరు. ఇతరుల వల్ల మీకు అసౌకర్యం కలిగినా సరే మీరు మరొకరికి ఇబ్బంది కలిగించకూడదని భావిస్తారు.
    ఎ. అవును   బి. కాదు

3.    మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను చాలా సాధారణంగా మీది కాని ఏ ప్రదేశంలోనైనా పడేయడానికి వెనుకాడరు.
    ఎ. కాదు   బి. అవును

4.    పార్కుల వంటి పబ్లిక్‌ ప్రదేశాలను ఎంట్రీ టికెట్‌ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా వాడవచ్చు అనుకోకుండా పరిశుభ్రత విషయంలో నియమాలను పాటిస్తారు.
    ఎ. అవును   బి. కాదు

5.    మీరు ఉద్దేశపూరకంగా సామాజిక స్పృహను ఉల్లంఘించక పోయినప్పటికీ పొరపాటున మీ కారణంగా మరొకరు అసౌకర్యానికి గురయినట్లు గమనిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు. సరిదిద్దే అవకాశం ఉన్న వాటిని సవరించుకుంటారు.
    ఎ. అవును   బి. కాదు

6.    మీరు వాడేసిన బ్యాండేజ్‌లు, స్వైన్‌ ఫ్లూ నిరోధక మాస్కుల వంటి వాటిని యథేచ్ఛగా పారేయడం ద్వారా అవి ఇతరులను అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి నియమిత పద్ధతిలోనే వాటిని డెస్ట్రాయ్‌ చేస్తారు.
    ఎ. అవును   బి. కాదు

7.    సివిక్‌ సెన్స్‌తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మీకు తెలుసు. మీ అభిప్రాయాలను ఎవరైనా చాదస్తంగా పరిహసించినా ఆ మాటలను పట్టించుకోరు.
    ఎ. అవును   బి. కాదు

8.    తమతోపాటు, సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిల్లలకు చెబుతారు. అలాగే తోటి పిల్లల సామాజిక నేపథ్యాన్ని విమర్శించడం తప్పని కూడా చెబుతుంటారు.
    ఎ. అవును   బి. కాదు

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సామాజిక జ్ఞానంతో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మీరు సామాజికంగా మీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనుకోవాలి. సమాజంలో పౌరులుగా సామాజిక విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి.

Advertisement

What’s your opinion

Advertisement