-
‘షాన్‌దార్’ ఎఫెక్ట్...
గాసిప్ బాలీవుడ్లో క్యూటెస్ట్ బ్యూటీగా ఆలియా భట్‌కు పేరు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆలియా, ఆ సినిమా విజయంతో మరో ఐదేళ్ల కెరీర్ కు ఖర్చీఫ్ వేసేసుకుంది. తరువాత వచ్చిన హంప్టీ శర్మాకీ దుల్హనియా, టు స్టేట్స్ సినిమాలు ఆలియాకు నటిగా మంచి పేరు తెచ్చాయి. అయితే ఆలియా గుడ్ టైమ్ కంటిన్యూ అవలేదు. సినిమాలు బాగున్నాయని పేరొచ్చినా, ఆఫర్లు వస్తున్నా... స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లలేకపోయారు. దీనికి తోడు రీసెంట్ ఫిల్మ్ షాన్‌దార్ ఇచ్చిన రిజల్ట్... బాక్సాఫీస్ దగ్గర ఈ బ్యూటీ గుడ్ విల్ అంతా పోగొట్టింది. చాలా ఫ్లాపు సినిమాలు వస్తుంటాయి గానీ ఆలియా భట్‌కు షాన్ దార్ తెచ్చిన బ్యాడ్ నేమ్ అంతా ఇంతా కాదు. చివరికి ఫిలింఫేర్ లాంటి అవార్డుల ఫంక్షన్ వేదికల్లోనూ షాన్దార్పై సెటైర్లు వేశారు. ఈ అపజయం ఆలియా కెరీర్ దారులు మూసుకుపోయినంత ప్రభావం చూపించింది. షాన్‌దార్ సినిమాను ఉద్దేశించి ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని ఆలియా భట్... ఈ మధ్య సోషల్ మీడియాలో స్పందిచారు. ఆ సినిమా అపజయానికి తాను డిప్రెస్ అయినట్లు వచ్చిన వార్తలకు సానుకూలంగా సమాధానమిచ్చారు. ’ఫ్లాప్ సినిమాలు తనను అభద్రతాభావానికి లోను చేయవని, అయితే రాబోయే సినిమాల్లో మరింత బాగా నటించాలన్న ఆలోచనలే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తాయని’ అన్నారు ఆలియా. ఈ ఒత్తిడి తనకు హాని చేస్తుందేమో అన్న భయం కలుగుతుంటుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల సెన్సార్ వివాదంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఉడ్తా పంజాబ్ సినిమాతో ఆలియా భట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ స్వింగ్‌తో షారుక్ ఖాన్‌తో పెయిర్ గా సినిమా దక్కించుకుంది. ‘డియర్ జిందగీ’ పేరుతో గౌరీ షిండే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఆలియాకు కెరీర్ లో దక్కిన పెద్ద ఆఫర్‌గా చెప్పొచ్చు. ‘రాబోయే సినిమాల్లో బాగా నటించాలని ఆలోచిస్తున్నా’ అన్న ఆలియా భట్ స్టేట్మెంట్ బహుశా డియర్ జిందగీ గురించేనేమో అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. -
ఆలియా చాలు
గాసిప్ షాహీద్ కపూర్, ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ‘షాన్‌దార్’ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫస్ట్ ట్రైలర్ చూసిన వాళ్లు ‘మాంచి కాంబినేషన్’ అంటున్నారు. పంకజ్ కపూర్‌లాంటి సీనియర్ నటులు కూడా నటిస్తుండడంతో ‘షాన్‌దార్’పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ సినిమా డెరైక్టర్ ‘క్వీన్’ సినిమాతో, షాహీద్ ‘హైదర్’ సినిమాతో సూపర్‌హిట్ కొట్టి ఉండడంతో ఈ కాంబినేషన్‌పై చాలా ఆసక్తి నెలకొంది.అయితే... కొందరు మాత్రం ఈ సినిమా పాత సినిమాలను గుర్తుకుతెస్తుందని అంటున్నారు. ఈ మాటలు ఆనోటా ఈనోటా షాహిద్ ఫ్యాన్స్ చెవుల వరకు చేరాయి. ‘‘పోసర్లు చూసి కథ చెప్పొద్దు’’ అని వారు కారాలు మిరియాలు నూరుతున్నారు.‘‘షాహీద్‌తో పనిలేదు... ఆలియా గ్లామర్ చాలు... సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి’’ అంటున్నారు మరోవైపు ఆలియా ఫ్యాన్స్.‘‘గాసిప్‌లు కూడా పబ్లిసిటీలో భాగమే... ఉచిత పబ్లిసిటి మంచిదే కదా!’’ అంటున్నారు ‘షాన్‌దార్’ సినిమా బాధ్యుల్లో ఒకరు. ఇదిలా ఉండగా... డెరైక్టర్ వికాస్ బల్కు షాహీద్- ఆలియా జంట తెగనచ్చేసిందట. ఆయన ఇప్పటికే మాంచి లవ్ స్టోరీలు రెండు సిద్ధం కూడా చేశాడట. చూద్దాం మరి ఏమవుతుందో!
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement