బ్రెయిన్‌ పవర్‌ | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ పవర్‌

Published Sat, Mar 10 2018 12:44 AM

special story to  Avani Chaturvedi - Sakshi

యుద్ధోన్మాదం, మారణ  హోమం అంతా మగశక్తిదే. నారీశక్తి ఆధిక్యం  కోసం చూడదు. నష్ట నివారణ  కోసం చూస్తుంది. నవ నిర్మాణం కోసం చూస్తుంది.

శత్రువు గురిపెట్టి కూర్చున్న మారణాస్త్రాన్ని ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్‌ చేసి ‘ఫట్‌’మని కొట్టడానికి కావలసింది.. కండలు తిరిగిన బాడీ కాదు, బ్రెయిన్‌! స్త్రీ, పురుషులలో అంత షార్ప్‌ బ్రెయిన్‌ ఎవరికుంది? ఇంకెవరికి! మహిళలకే. ‘మహిళలకే’ అని ఊరికే అనేయడం కాదు. పరిశోధకుల ‘కంపారిటివ్‌ స్టడీస్‌’లో.. ఫిమేల్‌ బ్రెయినే ఎప్పుడూ గుడ్‌ కండిషన్‌లోనే ఉంటుందని ఇప్పటికెన్నోసార్లు నిర్ధారణ అయింది. అదికాదు విశేషం. ఎలాంటి వరస్ట్‌ కండిషన్స్‌లోనైనా గుడ్‌ కండిషన్‌లోనే పనిచేస్తుందట మహిళల మైండ్‌. అదీ వాళ్ల గ్రేట్నెస్‌! కోపమొస్తే అరిచేయడం, రెచ్చగొడితే విరుచుకు పడడం మగవాళ్ల బలంలోని బలహీనతలు. యుద్ధ పరిస్థితుల్లో అవి నడవ్వు. ఓర్పుండాలి. వ్యూహం ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించే ‘ప్రెజన్స్‌ ఆఫ్‌ మైండ్‌’ ఉండాలి. ప్రపంచదేశాల రక్షణ వ్యవస్థలు మహిళల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి.. ‘అమ్మా.. రండి’ అని ఆహ్వాన దరఖాస్తులు పెట్టుకుంటున్నాయంటే ఆ ప్రెజెన్స్‌ ఆఫ్‌ మైండే కారణం! రెండు వారాల క్రితం అవని చతుర్వేది అనే యువతి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌ను గగనంలో సోలోగా గింగిర్లు కొట్టించి నేర్పుగా నేలకు దిగివచ్చింది.

అంతటి గట్స్‌ ఉన్న ఫస్ట్‌ ఇండియన్‌ ఉమన్‌.. అవని. ఇక నిర్మలా సీతారామన్‌ భారతదేశపు తొలి మహిళా రక్షణశాఖ మంత్రి. (ఇందిరాగాంధీ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు కానీ, ప్రధానిగా ఉంటూ అదనపు బాధ్యతగా మాత్రమే ఆమె ఆ శాఖను నిర్వహించారు). సోల్జర్లు, బాంబర్‌ పైలట్‌లు, కల్నళ్లు, జనరళ్లు.. ఇలా అన్ని స్థాయిలలో, అన్ని దేశాలలో మహిళలు కనిపించడం నిజానికిప్పుడు సాధారణం అయింది. అయితే ఏదో నిరూపించుకోవాలని వీళ్లీ యుద్ధక్షేత్రాల్లోకి రావడం లేదు. ‘వియ్‌ టూ’ అని పోటీగా కూడా పిడికిలి బిగించడం లేదు. కాన్ఫిడెన్స్‌ ఉంది. వచ్చేస్తున్నారు. దేశాలకు నమ్మకం ఉంది. వారిని రమ్మంటున్నాయి. నమ్మకం దేనిపైనంటే.. నారీశక్తి మీద!  హిస్టరీలో లిస్టవుట్‌ చేస్తే.. యుద్ధోన్మాదం, మారణహోమం అంతా మగశక్తిదే. ఊరికే దాహం! ఆధిక్యం కోసం. నారీశక్తి ఆధిక్యం కోసం చూడదు. నష్ట నివారణ కోసం చూస్తుంది. నవ నిర్మాణం కోసం చూస్తుంది. యుద్ధం కోసం పురుషుడు మీసాలైనా రాని పిల్లల్ని సైన్యంలోకి రప్పిస్తే,  స్త్రీ.. యుద్ధనేతల్ని సైతం పిల్లలుగా కూర్చోబెట్టి.. వాళ్ల చేతిలో తలా ఇంత ‘బుద్ధి’ని ముద్దలు చేసి పెడుతుంది. అభివృద్ధి కన్నా ఇప్పుడు ముఖ్యం బుద్ధి. అది మహిళ చేతిలో ఉంది. చెయ్యి చాపి అడగడం నామోషీ అనుకుంటే, పెట్టడానికి ఆమె చాపిన చెయ్యికి దోసిలి పడితే సరి.

మిగ్‌–21 బైసన్‌ యుద్ధ విమానాన్ని నింగిలో సోలోగా ఒక ఆట ఆడించేందుకు సిద్ధమవడానికి ముందు చిరునవ్వులు చిందిస్తున్న అవని చతుర్వేది (ఫైల్‌ ఫొటో) 

Advertisement
Advertisement