కట్నాల లాంఛానాల పీడను నిరాకరించే ... శుభలేఖ ... | Sakshi
Sakshi News home page

కట్నాల లాంఛానాల పీడను నిరాకరించే ... శుభలేఖ ...

Published Tue, Feb 28 2017 11:55 PM

కట్నాల లాంఛానాల పీడను నిరాకరించే ... శుభలేఖ ...

నాటి సినిమా

1980ల కాలం చాలా ఘోరమైన కాలం.ఆ రోజుల్లో ప్రతి రోజూ వరకట్న చావులు పేపర్లలోకనిపించేవి. కిరోసిన్‌ పోసి నిప్పంటించే భర్తలు,అత్తమామలు ఎందరో కాళ్ల పారాణి కూడా ఆరని ఆడపిల్లల ఉసురు పోసుకునేవారు. ఈ సమస్య మీద స్పందించిన కె.విశ్వనాథ్‌ అర్థవంతంగా తీసిన సినిమాయే ‘శుభలేఖ’.

అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ)కు అంకెలంటే పిచ్చి. ఒక లకారం. రెండు లకారాలు. మూడు లకారాలు... నోరు తెరిస్తే లక్షలే! ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వాలి. తన ఇంట్లో రెండు ప్లస్సులు ఉన్నాయట. అంటే ఇద్దరు కొడుకులు. ఒకరు బి.ఇ. మరొకరు ఎం.బి.బి.ఎస్‌. బి.ఇ చేసిన కొడుక్కు కనీసం నాలుగు లక్షలు కావాలని కోరుకుంటాడు. అది ఏ కాలం? 1982లో. ఆ కాలంలో వెయ్యి రూపాయలంటేనే చాలా పెద్ద డబ్బు. మరి నాలుగు లక్షల కట్నం అంటే మాటలా? అది కూడా చాలదు.

లాంఛనంగా లేటెస్ట్‌ అంబాసిడర్‌ కారు ఇవ్వాలట. ఆ తర్వాత ఎం.బి.ఏ చదవడానికి అమెరికా పంపించాలట. ఇవన్నీ ఓకే అయితే తాంబూలాలకు ఓకే అంటాడు. కాని దీనికి సుజాత (సుమలత) ఓకే అనదు. అందంగా ఉంటుంది. ఎం.ఏ చేసింది. ట్యూటర్‌గా పని చేస్తోంది. ఇంత బంగారు బొమ్మను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. మళ్లీ ఈ లకారాలు వికారాలు ఏమిటి? అందుకే సుజాత తిరగబడుతుంది. దాంతో ఆదిశేషయ్యకు కోపం వస్తుంది. ఆమె పని చేసే కాలేజ్‌కు తనే పెద్ద కనుక ఉద్యోగంలోంచి ఊడగొట్టి పంపిస్తాడు. ఇంట్లో కూడా ఒకటే అలజడి ఏర్పడుతుంది. కట్నం ఎందుకు అని ప్రశ్నించినందుకే ఇన్ని గొడవలు.

కాని ప్రతి... చర్యకు సమానమైన ప్రతిచర్య కూడా ఉంటుంది. ఈ సంఘంలో ఒక మంచి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి మంచికి మారు పేరే మూర్తి (చిరంజీవి). బి.ఏ వరకూ చదువుకుని హోటల్‌లో సర్వర్‌గా పని చేసే మూర్తి... సుజాతకు వచ్చిన కష్టాన్ని గమనిస్తాడు. ఆమెకు అండగా నిలబడతాడు. అంకెల ఆదిశేషయ్య వల్ల అతను కూడా ఉద్యోగం కోల్పోయి, సుజాతను తీసుకొని హైదరాబాద్‌ వస్తాడు. ఇద్దరూ అక్కడే ఉంటూ తమ జీవితాలను మళ్లీ చక్కదిద్దుకుంటారు. సుజాత కోసం మూర్తి ఒక మంచి సంబంధం చూస్తాడు. కాని ఆమె మనసుకు నచ్చినవాడు మూర్తే అని గ్రహించిన ఆ పెళ్లికొడుకు అతడితోనే ఆమె పెళ్లి జరిపించడంతో కథ సుఖాంతం అవుతుంది.  ఏ మనిషైతే కట్నం కోసం అవమానించాడో అదే మనిషికి చిన్న కోడలిగా సుజాత చెల్లెలు (తులసి) వెళ్లి ‘నలభై వేలు పెట్టి కొనుక్కున నీ చిన్న కొడుకును నాకు అప్పజెప్పి వెళ్లిపో’ అని కేసు వేయడం ఈ కథలోని క్లయిమాక్స్‌. కట్నం అనేది ఎంత దుర్మార్గమో అది ఆడపిల్లల తల్లిదండ్రులను ఎంతగా పీల్చి పిప్పి చేస్తుందో చెప్పడానికి ఆదిశేషయ్య కళ్లతో పాటు సమాజంలో అత్యాçశకు పోయే అబ్బాయిల తల్లిదండ్రుల కళ్లను కూడా తెరిపించడానికి ఈ సినిమా ప్రయత్నిస్తుంది. ప్రభావం చూపుతుంది.

1980ల కాలం చాలా ఘోరమైన కాలం. ఆ రోజుల్లో ప్రతి రోజూ వరకట్న చావులు పేపర్లలో కనిపించేవి. కిరోసిన్‌ పోసి నిప్పంటించే భర్తలు, అత్తమామలు ఎందరో కాళ్ల పారాణి కూడా ఆరని ఆడపిల్లల ఉసురు పోసుకునేవారు. ఈ సమస్య మీద స్పందించిన కె.విశ్వనాథ్‌ అర్థవంతంగా తీసిన సినిమాయే ‘శుభలేఖ’. చిరంజీవి, సుమలత ఈ సినిమాకు ఒక అందమైన సంస్కారంగా ఇమిడి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సత్యనారాయణ– రాళ్లపల్లి ఈ సినిమాకు సూత్రధారులై కథను నడిపించడమే కాదు అద్భుతమైన నటనతో తమ ముద్ర వేస్తారు.

కె.వి.మహదేవన్‌ సంగీతం, గొల్లపూడి మారుతిరావు మాటలు ప్రతిభావంతంగా ఉంటాయి. ‘రాగాల పల్లకిలో కోయిలమ్మ’, ‘అయితే అదే నిజమైతే’పాటలు జనరంజక పాటలు. ఆల్‌ ఇండియా రేడియోలో జనరంజని పాటలు. వీటితో పాటు అన్నమయ్య కీర్తనలు రెండు ‘విన్నపాలు వినవలె’, ‘నెయ్యములల్లో’ ఎంతో అందంగా సినిమా బాణీలో కె.వి. మహదేవన్‌ ద్వారా ఇమిడిపోయాయి. సుధాకర్‌ ‘శుభలేఖ సుధాకర్‌’ అయింది ఈ సినిమాతోనే. సినిమా వచ్చి ముప్పై ఏళ్లు నిండిపోయాయి. ఇవాళ్టికీ పరిస్థితిలో మార్పు ఉందా? కట్నాలు అలాగే ఉన్నాయి. ఆ పేరు నేరుగా లేకపోయినా లాంఛనాలు, ఆర్భాటాలు పెరిగాయి. పెళ్లి పేరుతో భయంకరమైన దుబారా పెరిగి ఆడపిల్ల తరఫువారు అతలాకుతలం అవుతున్నారు. చివరకు పెళ్లికి 500 మందికి మించి పిలవకూడదని చట్టం చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

ఇదంతా ఎందుకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి జీవితాన్ని మొదలెట్టడానికి ఇంత హంగామా ఎందుకు ఖర్చు ఏడుపు ఏడుపు ఎందుకు? సమాజం మరింత సంస్కారవంతం కావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకూ ‘శుభలేఖ’ వంటి సినిమాల అవసరం ఉండనే ఉంటుంది.
– కె

Advertisement
Advertisement