టారో : 22 అక్టోబర్‌ నుంచి 28 అక్టోబర్, 2017 వరకు | Sakshi
Sakshi News home page

టారో : 22 అక్టోబర్‌ నుంచి 28 అక్టోబర్, 2017 వరకు

Published Sun, Oct 22 2017 1:48 AM

Tarot: 22 October to 28 October, 2017

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొండి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
కలిసివచ్చే రంగు : ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది.
కలిసివచ్చే రంగు : పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాధించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్రలకు వెళ్లండి.
కలిసివచ్చే రంగు : నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ విషయం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లండి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది.
కలిసివచ్చే రంగు : పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది.
కలిసివచ్చే రంగు : తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : లేత గులాబీ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
కలిసివచ్చే రంగు : లేత గోధుమ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితాన్ని నిరంతరం ఆస్వాధించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ

Advertisement
Advertisement