ఏ పేరులో ఏముందో?! | Sakshi
Sakshi News home page

ఏ పేరులో ఏముందో?!

Published Sun, Jun 15 2014 11:09 PM

ఏ పేరులో ఏముందో?!

విడ్డూరం
 
పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధిం చాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో... జైలుకు పోవాల్సిందే!
     
మలేసియాలో పిల్లలకు జంతువులు, పురుగులు, పండ్లు, కూరగాయలు, రంగుల అర్థాలు వచ్చే పేర్లు పెట్టకూడదు. హిట్లర్, వోతీ లాంటి చాలా పేర్ల మీద అక్కడ బ్యాన్ ఉంది.
 
ఐస్‌ల్యాండ్‌లో క్రిస్టీ/క్రిస్టా, కరొలినా లాంటి పేర్లు పెట్టకూడదు. ఎందుకంటే వాటిలో ‘సి’ అనే అక్షరం ఉంటుంది కదా! ఆ దేశ అక్షరమాలలో ‘సి’ ఉండదు. కాబట్టి ఆ అక్షరంతో వచ్చే పేర్లు పెట్టకూడదు!
 
పేర్ల విషయంలో నార్వే దేశం చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని వేల పేర్ల మీద నిషేధం ఉంది ఆ దేశంలో. వాటిలో ఏదైనా పెడితే కేసు పెడతారు. గతంలో ఓసారి... అధికారులు చెప్పినట్టుగా తన బిడ్డ పేరు మార్చనందుకు ఓ మహిళను రెండు రోజులు జైల్లో కూడా పెట్టారు!
     
జర్మనీలో ఆండర్సన్ అన్న పేరు పెట్టకూడదు. అదే విధంగా టేలర్, టాబీ, రిలే, క్విన్ లాంటి పేర్ల మీద నిషేధం ఉంది. లింగ నిర్థారణ చేసే విధంగా పేర్లు పెట్టడానికి ఆ దేశం ఒప్పుకోదు!
 
న్యూజిలాండ్‌లో ప్రిన్‌‌స, ప్రిన్సెస్, కింగ్, మేజర్, సార్జెంట్, నైట్ లాంటి పేర్లు పెట్టకూడదు. అవి స్థాయిని సూచిస్తాయి కాబట్టి కొందరి మనోభావాలు దెబ్బతింటాయంటుందా ప్రభుత్వం!
 
పోర్చుగల్ ప్రభుత్వం నిషేధించిన పేర్ల జాబితా దాదాపు 41 పేజీలు ఉంటుంది. కారణమేంటో తెలియదు కానీ... అందులో మోనాలిసా అన్న పేరు కూడా ఉంది. అంతేకాదు... అక్కడ పిల్లలు పుట్టే సమయానికే పేరు ఆలోచించి పెట్టుకోవాలి. ఎందుకంటే బర్‌‌త సర్టిఫికెట్‌లో నమోదు చేసిన పేరునే జీవితాంతం ఉపయో గించాలి. ముద్దు పేరు రాస్తే కుదరదు!  
 

Advertisement
Advertisement