వెన్ను నొప్పా..అశ్రద్ధ చేస్తే మిగిలేది వైకల్యమే | Sakshi
Sakshi News home page

వెన్ను నొప్పా..అశ్రద్ధ చేస్తే మిగిలేది వైకల్యమే

Published Mon, Nov 24 2014 11:04 PM

don't neglect the backbone pain

వెన్ను పూస ఒక పవర్ హౌస్ లాంటిది. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా ఉంటాయో అలగే మానవ శరీరానికి వెన్ను పూస పిల్లర్ లాంటిది. కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీనివల్ల మెడ, భుజం, తల, కాళ్ళు, చేతులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, జిల్ జిల్ మని కరెంట్ షాక్ కొట్టినట్టు, బలహీన పడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. మరికొంత మందికి లైంగిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇలాంటి నిర్జీవమైన పవర్ హౌస్‌కి  తిరిగి శక్తిని ఇవ్వాలంటే అదేమి ఆషామాషి చికిత్సలతో కాకుండా కేవలం కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలతోనే సాధ్యం అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ డా ॥పి.కృష్ణప్రసాద్.
 
అసలు ఏమైంది?
ఒకరోజు హాస్పిటల్‌లో బాగా బిజీగా ఉన్న సమయంలో ఒక పేషెంట్‌కి సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కలిశారు. పేషెంట్‌కి ఏమయిందని డాక్టర్ గారు అడిగితే వారి బంధువులు ఈ విధంగా చెప్పారు. ‘నడుము, మెడ నొప్పులు బాగా తీవ్రంగా ఉంటాయి బెడ్ పై ఏ పక్కకు తిరిగిన కాళ్లల్లో, చేతుల్లో, భుజాలు, నడుము అంతా కరెంట్ షాక్‌లు వచ్చినట్టు ఉంటుంది, పట్టుమని ఐదు నిమిషాలు కూడా కూర్చోలేడు, నిల్చోలేడు, పడుకొని కుడి, ఎడమలకు తిరిగితే జిల్లుమని కరెంట్ షాక్‌లు కొట్టినట్టు ఉండేది, నడుముతో పాటు మెడ ప్రాంతంలో కూడా తీవ్రమైన నొప్పి వచ్చేది.

రెండు చేతులు, కాళ్లు తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్నట్లు పోట్లు, మంటలు, నడిస్తే తల తిరిగి ఎక్కడ పడిపొతాడోనన్న భయం, చేతులతో ఏ వస్తువులు ఎత్తలేని పరిస్థితితో ఇలా ఈ సమస్యల చాలా కాలంగా ఉండటంతో జీవితం ఇలా అయిందేమిటన్న డిప్రెషన్‌లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు’ అని చెప్పారు. ప్రత్యక్షంగా పేషెంట్‌ని, రిపోర్ట్స్ క్షుణ్ణంగా చూసిన తర్వాత అతనికి వెన్నుపూసలో లంబార్ వర్టిబ్రా లోని ఔ2, ఔ4, ఔ5, ఔ1 మధ్య ఉండాల్సిన జ్చఞ తగ్గి అక్కడ ఉన్న డిస్క్‌లు బయటకు వచ్చి నరాల మీద బాగా ఒత్తిడి పడుతుంది, అలాగే మెడ ప్రాంతానికి వస్తే ఇ3, ఇ4, ఇ5, ఇ6 మధ్య కూడా ఇదే సమస్య ఉన్నట్టు నిర్ధారించారు.
 
పవర్ హౌస్‌కి చికిత్స:

ఈ సమస్య గురించి పెయిన్ కిల్లర్స్, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ సర్జరీ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు పేషెంట్ యొక్క శారీరక, మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సను ప్రారంభించారు.
 
కేరళ పంచకర్మతో:
ఎన్ని చికిత్సలు చేసిన తగ్గని వెన్ను నొప్పులకు ఆయుర్వేదంతో మంచి నాణ్యత కలిగిన, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన నానో రకేణువులతో కూడిన నూనెలు, ఔషధాలతో ప్రత్యేకంగా చికిత్సలు చేయటం జరిగింది. పంచకర్మ చికిత్సలతో అతిముఖ్యమైన అభ్యంగనం, తైలధార, కటిబస్తీ, గ్రీవబస్తీ, విరోచనం, వస్తి చికిత్సలు అందించారు. ఇలా మొదటి పది రోజులు తరువాత అరగంట సేపు కూర్చోవటం అతనిలో విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పక్కమీద ఎటు తిరిగినా జిల్లుమన్న కరెంట్ షాక్‌లు ఇప్పుడు లేవు ఇప్పుడు నొప్పి ఉన్నా స్థిరంగా నడవ సాగుతున్నారు.

మెడపై ఉంటే ఒత్తిడి బాగాతగ్గింది ఇంకొక 2 వారాలు తర్వాత నడుము గట్టిగా పిసికేసినట్టు ఉన్న నొప్పి అంతగా లేదు. చేతులు, కాళ్లు చాలా తేలికయ్యాయి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు చాలా వరకు తగ్గుముఖం పట్టి అన్ని పనులు చేసుకోవచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా 25 రోజులు అత్యంత శక్తివంతమైన కేరళ పంచకర్మ చికిత్సలు, ఔషధాలు ఇచ్చి, ఇంకొక మూడు నెలల పాటు కొన్ని ఔషధాలు ఇచ్చి సూచించిన వ్యాయామాలు చేయమని, మలబద్ధకం లేకుండా చూసుకోమని చెప్పారు. ఇప్పటికి ఆరునెలల గడిచాయి నొప్పి అన్న మాటే లేదు, ఒక ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న, చిన్న వ్యాయామాలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు.

Advertisement
Advertisement