‘ఫ్యాన్’ రిలీజ్ వాయిదా | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్’ రిలీజ్ వాయిదా

Published Tue, Feb 10 2015 1:00 AM

‘ఫ్యాన్’ రిలీజ్ వాయిదా - Sakshi

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయంతో తెరకెక్కుతున్న ‘ఫ్యాన్’ విడుదల తేదీ వాయిదా పడినట్లు సమాచారం. యశ్‌రాజ్ ఫిల్మ్స్-షారుఖ్ కాంబినేషన్‌తో చాలాకాలం తర్వాత రూపొందుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యశ్‌రాజ్ ఫిల్మ్స్ తొలుత ప్రకటించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యమయ్యే అవకాశాలు ఉన్నందున విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మనీష్‌శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యాన్’లో షారుఖ్ సరసన ఇలియానా, వాణీ కపూర్ నటిస్తున్నారు.

Advertisement
Advertisement