మెజీషియన్స్ | Sakshi
Sakshi News home page

మెజీషియన్స్

Published Tue, Jul 22 2014 4:14 AM

మెజీషియన్స్

అబ్రకదబ్ర అంటూ కాకిని కోకిల చేసే ‘మాయ’గాళ్లు మెజీషియన్లు. ఇన్నాళ్లూ మేజిక్ అంతా వన్‌‘వ్యూన్’ షోనే. ఇప్పుడిప్పుడే ఉమెన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మెజీషియన్స్ షోలో లేడీ మెజీషియన్లు తమ ‘మాయ’లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ‘మాయ’గాళ్లకు దీటుగా ‘షో’ చేసి సత్తా చాటారు. ఈ సందర్భంగా వారిని పలకరించిన ‘సిటీప్లస్’తో మేజిక్ ఫీల్డ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు.
 
 ఫ్యామిలీ అంతా...
 మా నాన్న మెజీషియన్. మా చెల్లెలు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెజీషియన్‌గా పేరుతెచ్చుకుంది. వాళ్ల స్ఫూర్తితోనే నేనూ ఈ రంగంలో అడుగుపెట్టా. ఇదో అద్భుతమైన కళ. ప్రేక్షకుల స్పందన, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివి. మా నాన్నే నా ఫేవరె ట్ మెజీషియన్. ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా. భవిష్యత్తులో దీన్నే వృత్తిగా ఎంచుకుంటా. మహిళలు కూడా మగాళ్ల కంటే బాగా మేజిక్ చేయగలరని నిరూపించడమే నా ధ్యేయం.
 - జినియా
 
 నాన్న స్ఫూర్తితో..
 మా నాన్న ప్రదీప్ ఇంటర్నేషనల్ మెజీషియన్. చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా. ఐదేళ్ల నుంచే మేజిక్ చేస్తున్నా. నేను హైదరాబాద్‌లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డ్యాన్‌‌స, పాటలు పాడటం వంటివి అందరూ చేస్తారు. మేజిక్ అలా కాదు.. ఇదో యూనిక్ టాలెంట్. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టా.
 -  శైలీ
 
 ప్రోత్సాహం బాగుంది.. మాది మహారాష్ట్రలోని పుణే.
 చిన్నప్పుడే మేజిక్ మాయలో పడిపోయా. మాటలు రాని వయసు నుంచి మేజిక్ చేస్తున్నా. మా ఇంట్లో బాగా ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇక ఇందులో రాణించాలంటే రోజూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మంచి మెజీషియన్‌గా పేరు తెచ్చుకోగలం.
 - మజితా
 -  ప్రవీణ్ కాసం

Advertisement
Advertisement