కాలపరీక్షకు నిలిచిన స్వచ్ఛ పరిమళం | Sakshi
Sakshi News home page

కాలపరీక్షకు నిలిచిన స్వచ్ఛ పరిమళం

Published Sun, Jan 25 2015 3:15 AM

ఆకార్ పటేల్

 అవలోకనం
 
 గాంధీ బోధనల్లో, ఆచరణలో అర్థం కానివి ఏవీ లేవు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి నేటికీ  చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా!  

 ఈ నెలలో భారత దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధ వ్యక్తి హంతకుడి 67వ వర్ధంతిని మనం గుర్తుంచుకోబోతున్నాం. అయితే గాంధీ ని గాడ్సే ఆనాడు ఎందుకు చంపినట్లు? అన్నదే కీలకం. అరెస్టయ్యాక గాడ్సేని నాటి హిందుస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడు, గాంధీ కుమారుడు దేవదాస్ కలుసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న ఘటనను నాథూరాం గాడ్సే సోదరుడు, గాంధీ హత్యానేరంలో సహ భాగస్వామి, సహ దోషి అయిన గోపాల్ గాడ్సే (జైలు పాలయ్యాడు కానీ ఉరికెక్కలేదు) రాసిన ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ పుస్తకంలో వర్ణించారు. తన తండ్రి హంతకుడిని చూసేందుకు గాంధీ తనయుడు పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎలాంటి నమ్రతాలేని, రక్తపిపాసిని తాను కలుసుకుంటున్నట్లు దేవదాస్ భావించి ఉంటాడని గోపాల్ గాడ్సే ఆ పుస్తకంలో రాశాడు. అయితే అత ను ఊహించినదానికీ, నాథూరాం మృదు సంభాష ణలు, ప్రశాంత చిత్తానికీ, ఏమాత్రం పోలిక లేకుం డాపోయిందని గోపాల్ పేర్కొన్నాడు.

 వారిద్దరి కలయిక ఇలాగే జరిగిందా అనేది మనకయితే తెలీదు. కానీ, గోపాల్ గాడ్సే ప్రకారం ‘నేను నాథూరాం వినాయక్ గాడ్సేని, హిందూ రాష్ట్ర దినపత్రిక సంపాదకుడి’ని అని నాథూరాం తనను కలవడానికి వచ్చిన దేవదాస్ గాంధీకి చెప్పాడట. ‘ఈ రోజు మీ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదానికి నేనే కారణం. మీకూ మీ కుటుంబానికి కలిగిన ఈ వియోగానికి నేను చాలా చింతిస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. మీ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం తోనో, కక్షతోనో లేక దురుద్దేశంతోనో నేనీ కార్యాన్ని తలపెట్టలేదు’ అని నాథూరాం అన్నాడు. అలాంట ప్పుడు ఇలా ఎందుకు చేశావని దేవదాస్ అడిగారు.

 కేవలం రాజకీయ అంశమే దీనికి కారణమని నాథూరాం చెప్పాడు. తన చర్యను వివరించడానికి కాస్త సమయం కావాలని నాథూరాం కోరాడు. కానీ పోలీసులు అనుమతించలేదు. న్యాయస్థానంలో కూడా నాథూరాం తన చర్య గురించి ఒక ప్రకట నలో వివరించాడు. అయితే కోర్టు దాన్ని నిషేధిం చింది. నాథూరాం వీలునామాను తర్వాత గోపాల్ గాడ్సే తన పుస్తకానికి అనుబంధంగా పునర్ముద్రిం చాడు. ఆ వీలునామాలోని చివరి వాక్యం ఇలా సాగుతుంది. ‘న్యాయస్థానంలో నేను చేసిన ప్రకట నపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తి వేసినట్లయితే, దాన్ని ప్రచురించడానికి నీకు అధికారమి స్తున్నాను.’

 ఇంతకూ ఆ ప్రకటనలో ఏముంది? దాంట్లో గాడ్సే కింది అంశాలను పొందుపర్చాడు. గాంధీ అంటే తనకెంతో గౌరవమని చెప్పుకున్నాడు. ‘‘అన్నిటికంటే మించి వీర సావర్కర్, గాంధీ రాసి న, మాట్లాడిన ప్రతిదాన్నీ నేను క్షుణ్ణంగా చది వాను. నాకు తెలిసినంతవరకు.. గత ముప్పై సంవ త్సరాల కాలంలో ఏ ఇతర అంశం కంటే, భారతీ యుల ఆలోచనలను, కార్యాచరణను మలచడంలో ఈ ఇద్దరు సిద్ధాంతవేత్తలదే అధికపాత్ర. ముప్పై రెండు సంవత్సరాలుగా గాంధీపై పేరుకుపోతూ వస్తున్న ఆగ్రహం, ప్రకోపం, ఇటీవల ఆయన చేప ట్టిన ముస్లిం అనుకూల నిరాహారదీక్షతో చరమ స్థాయికి చేరుకుంది. దీంతోటే గాంధీ అనే వ్యక్తి ఉనికిని తక్షణమే ముగించాల్సిన అవసరముందని నేను భావించాను. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి భారతీయుల హక్కులు, వారి శ్రేయస్సును పరిరక్షించడానికి గాంధీ చాలా బాగా పనిచేశారు. కానీ, అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చినప్పుడు ఆయన ఒక స్వీయాత్మక మనస్తత్వాన్ని పెంపొం దించుకున్నారు. దీంట్లోంచే ఏది తప్పు, ఏది సరై నది అని తేల్చడంలో తాను మాత్రమే అంతిమ న్యాయమూర్తి అనే అభిప్రాయాన్ని పెంచుకున్నారు. దేశం తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లయితే, తన లోపరాహిత్యాన్ని, అమోఘమత్వాన్ని యావ ద్దేశం ఆమోదించవలసి ఉంటుంది. అలా జరగనట్ల యితే కాంగ్రెస్‌కు దూరంగా జరిగి తన సొంత మార్గాన్ని కొనసాగిస్తారు.’’

 ఈ ఆలోచనే గాంధీకి వ్యతిరేకంగా తీవ్ర చర్య కు పురికొల్పింది. ఎందుకంటే నాథూరాం దృష్టిలో గాంధీ ఆలోచనలకు వ్యతిరేక వైఖరి అవలంబించా లంటే అడ్డదారులు పనికిరావు. కాంగ్రెస్ తన ఇచ్ఛను గాంధీ పాదాక్రాంతం చేయాలి. ఆయన విపరీత మనస్తత్వానికి, చాపల్యానికి, అధిభౌతికత త్వానికి, ఆదిమ దార్శనికతకు తాళం వాయించడా నికే అది కట్టుబడాలి. లేదా గాంధీ లేకుండానే కాంగ్రెస్ కొనసాగాలి.

 నాథూరాం మరొక ఆరోపణ ఏమంటే, గాంధీ పాకిస్తాన్‌ను సృష్టించారు. ‘గాంధీ సమ్మతితో కాం గ్రెస్ అగ్రనేతలు దేశాన్ని విభజించి, చీల్చి వేస్తున్న పుడు, (దేశం పట్ల మేం అప్పటికే ఒక ఆరాధనా భావాన్ని పెంచుకుని ఉన్నాం) నా మనస్సు ఆగ్ర హంతో దహించుకుపోయింది. నాకు వ్యక్తిగతంగా ఏ ఒక్కరిమీదా దురుద్దేశం లేదు కానీ ముస్లింల పట్ల అన్యాయంగా సానుకూల విధానంతో వ్యవహరిస్తు న్న ప్రస్తుత ప్రభుత్వం పట్ల నా కెలాంటి గౌరవ భావం లేదని చెబుతున్నాను. అదే సమయంలో ఈ ప్రభుత్వ విధానం మొత్తంగా గాంధీ ఉనికితోటే సాధ్యమవుతోందని నేను స్పష్టంగా గ్రహించాను’.

 అయితే గాడ్సే వాదనలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే, గాంధీ విపరీత మనస్తత్వం కలవా రని గాడ్సే ఆలోచించడమే. గాంధీ పట్ల యావత్ ప్రపంచం దీనికి వ్యతిరేకంగానే ఆలోచిస్తోంది. పైగా గాడ్సే ప్రకారం గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఒక నియం త. తన దృక్పథాన్ని కాంగ్రెస్ ఆచరించేలా చేసేం దుకోసం గాంధీ నిరాహార దీక్ష చేపట్టారని కూడా గాడ్సే అన్నాడు. ఒక నియంతకు ఆదేశించడం తప్ప మరే చర్యకైనా పూనుకోవలసిన అవసరం ఏముం ది? గాంధీ చివరి నిరాహారదీక్షను (పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేయకూడదన్న భారత్ నిర్ణయా నికి వ్యతిరేకంగా) నాథూరాం వ్యతిరేకిస్తున్నాడు. అయితే భారత్ గతంలో ఈ అంశంలో చేసిన వాగ్దానం నుంచి వెనక్కి పోయినప్పుడు మాత్రమే ఇలా జరిగింది. వాస్తవానికి ఈ వ్యవహారంలో భారత్ హుందాతో, సరైన దారిలో వెళ్లేటట్టు చేసింది గాంధీ మాత్రమే.
 నాథూరాం చెప్పిందాంట్లో ఏ కొంచెం కూడా తర్కబద్ధంగా లేదు. తన చర్యకు ఏది కారణం అనే అంశంపై గతంలో తను చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉంది. గాంధీ లౌకిక భావజాలం పట్ల నాథూరాం ద్వేషం పెంచుకున్నాడు. ఈ లౌకిక భావ జాలమే నిజమైన హిందూ స్ఫూర్తి. ఆరెస్సెస్ ప్రభా వంతో సంపూర్ణంగా కలుషితమైన ఆలోచనతో అతడు ఈ స్ఫూర్తినే అంతిమంగా వ్యతిరేకించే స్థాయికి వెళ్లిపోయాడు. వాస్తవమేమిటంటే గాంధీ బోధనల్లో కాని, ఆయన ఆచరణలో కాని అర్థం కాని వి, ఆక్షేపణీయ మైనవి ఏవీలేవు. అందుకే రాజకీయ వేత్తగా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి దశా బ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది.

 సుప్రసిద్ధ రచయిత జార్జి ఆర్వెల్ 1949లో గాంధీ గురించి రాస్తూ ఇలా అన్నారు. ‘నాలాగే గాం ధీ పట్ల ఎవరైనా ఒక సౌందర్యాత్మక అప్రీతిని, అయి ష్టతను కలిగి ఉండవచ్చు. ఆయనకు ఆపాదించిన రుషిత్వ భావనను ఎవరైనా తిరస్కరించవచ్చు (గాంధీ ఎన్నడూ ఏ రకంగానూ తనను రుషిలా భావించుకోలేదు), రుషిత్వాన్ని ఒక ఆదర్శభావ నగా ఎవరైనా తోసిపుచ్చి, గాంధీ ప్రాథమిక లక్ష్యా లు మానవ వ్యతిరేకమని, ప్రతీఘాతుకతత్వంతో కూడినవని ప్రకటించవచ్చు. కాని రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో, మన కాలపు ఇతర ప్రధాన రాజకీయ ప్రముఖులతో పోల్చి చూసినప్పుడు, తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా!’
 నాథూరాం ఆరోపణలు కాల పరీక్షకు నిలబ డని సమయంలో ఈ 2015లో కూడా ఇదెంత వాస్త వమో కదా!
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
Aakar.patel@icloud.com)

Advertisement
Advertisement